AP 3Capitals : హైకోర్టు తీర్పుతో.. జగన్ సమీక్షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో 3 రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తన తీర్పులో స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజధాని అంశంలో చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి లేదని వెల్లడించింది. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించబోతున్నారు.
హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నిపుణులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సమీక్ష అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన మీడియాకు వివరించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొందరు రాజకీయ ప్రముఖులు హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. మరికొందరు సీఎం జగన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మానుకోవాలని.. హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని అన్నారు.
Also Read
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
తాజావార్తలు
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?