రాజశేఖర్ రెడ్డి కుటుంబం కంటే టీడీపీ హయాంలో ఎక్కువ అభివృద్జి జరిగిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుంటానని వైస్సార్సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమరనాథ్ అన్నారు. చంద్రబాబు చూసి ఉత్తరాంధ్ర ప్రజలు అస్యహించుకుంటున్నారని ఆయన విమర్శించారు. అమరావతి ప్రజల రాజధాని కాదు పెట్టుబడిదారుల రాజధాని అని, ఉత్తరాంధ్ర రాయలసీమ మీద చంద్రబాబు విషం చిమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపార అని, ఉత్తరాంధ్రకు వచ్చి చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. శాసనసభకు రాజధానిపై నిర్ణయం తీసుకునే హక్కు లేదని న్యాయస్థానం చెప్పిందని, గౌరవ న్యాయస్థానం తీర్పును మేము గౌరవిస్తామని ఆయన అన్నారు. శాసనసభ వేదిక చంద్రబాబు రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు.. అదే తీర్పు చంద్రబాబుకు ఎందుకు వర్తించదో నాకు అర్ధం కాలేదన్నారు.
శాసనసభ చట్టాలు చేయకపోతే ఇక మా పని ఏమిటో అర్థం కాలేదని, ప్రజాస్వామ్యంలో ఒక పిల్లర్ కు పని లేదని చెపితే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానులు బిల్లు మళ్లీ ప్రవేశ పెడతామని ఆయన స్పష్టం చేశారు. మూడు రాజధానుల బిల్లు ఈ సమావేశాల్లో పెడతమా వచ్చే సమావేశాల్లో పెడతమా అనేది సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. బీజేపీ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా సుజనా చౌదరి మాట్లాడుతున్నారని, కర్నూల్లో న్యాయ రాజధాని పెట్టాలని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. కర్నూల్లో హైకోర్టు పెడతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రఘురామకృష్ణమరాజు వంటి జోకర్ బ్రోకర్ లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.