కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఎన్నో సినిమాల విడుదల వాయిదా పడింది. అయితే కరోనా విజృంభిస్తున్న కూడా.. సంక్రాంతి బరిలో అక్కినేని నాగార్జున, నాగచైతన్యలు నటించిన బంగార్రాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సంపాందించుకుని సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో బంగార్రాజు సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్‌ల భేటీ గురించి […]
వైసీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త పోట్లూరి వరప్రసాద్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి డీకే అరుణ కుమార్తె శృతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి, ఆమె స్వంతగా నిర్మించుకున్న ప్రహరి గోడతో పాటు రేకులను సైతం జేసీబితో ధ్వంసం చేయించారు. అంతేకాకుండా శృతిరెడ్డిని బెదిరింపులకు గురి చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పీవిపీతోపాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ […]
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు కరోనా సోకింది. దీంతో వారు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే స్వల్ప లక్షణాలతో కరోనా సోకిందని చంద్రబాబు తెలిపారు. దీనిపై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తూ.. చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. […]
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో కరోనా కేసులు అనుహ్యంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్డౌన్ లాంటివి విధించి కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. అయితే తెలంగాణలో సైతం కరోనా కోరలు చాస్తోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 2,983 కరోనా […]
కరోనా వైరస్ విజృంభన కోనసాగుతూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రాకముందు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలను కఠినతరం చేసింది. ఫస్ట్, సెకండ్ వేవ్‌లతోనే రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూసాయి. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారికి గతంలో 14 రోజులు సెలవులను ప్రకటించిన సింగరేణి సంస్థ.. ఇప్పుడు 7రోజులు మాత్రమే కరోనా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్రం తాజాగా […]
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు తీవ్రతరం చేస్తూ.. నైట్ కర్ఫ్యూను విధించారు. మరికొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్డౌన్ కూడా విధిస్తున్నారు. అయితే ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి ఈ నెల 31 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ […]
ఏపీ ఉద్యోగులంతా ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరుపుకున్నారు. సీఎం జగన్ ప్రకటించిన 11వ పీఆర్సీకి ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని, ఉద్యోగులంతా పీఆర్సీ ప్రకటనతో నిరాశ చెందారని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణ మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రకటించిన రివర్స్ పీఆర్సీకీ నిరసనగా రేపు ఢిల్లీలో నిరాహార దీక్ష చేపడుతానన్నారు. రేపు ఉదయం 8గంటల నుంచి […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. సీఎం వాక్సిన్ తీసుకున్నాడో లేదో తెలియదని, వాక్సిన్ తీసుకొమ్మని చెప్పడు, బీజేపీ ఒత్తిడితో గాంధీ హాస్పిటల్‌కి పోయిండు అని ఆయన అన్నారు. టైమ్ పాస్ కోసం కేబినెట్ మీటింగ్ పెట్టిండని, 317 జీఓపై కేబినెట్ లో చర్చించక పోవడం దుర్మార్గమని ఆయన అరోపించారు. ఉద్యోగులు వాళ్ల చావు వాళ్ళు చావాలని కేసీఆర్ అనుకుంటున్నాడా అని ఆయన విమర్శించారు. 317 జీఓను సవరింవే వరకు […]
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తితో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈనెల 30 వరకు సెలవులు ప్రకటించింది. ఏపీలో మాత్రం విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం సెలవులకు ప్రకటించకుండా.. నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించింది. అలాగే మద్యం దుకాణాలకు ఒక గంట సమయం మినహాయింపు ఇచ్చింది. దీంతో జనసేనాని పవన్ వైసీపీ ప్రభుత్వంకు […]
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని, త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పనిచేయాలని కోరుకుంటున్నానని పవన్ అన్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతో పాటు […]