రేపు పోలవరానికి సీఎం వైఎస్ జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించనున్న సీఎం జగన్, కేంద్రమంత్రి షెకావత్ పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా పోలవరం పునరావాస కాలనీలలోనూ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరుతారు. అయితే 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు 1 పునరావాస కాలనీకి సీఎం జగన్ చేరుకోనున్నారు.
అక్కడ నిర్వాసితులతో జగన్ మాట్లాడి, అనంతరం 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి జగన్ చేరుకుంటారు. అక్కడ అరగంట పాటు నిర్వాసితులతో వారి సమస్యలు సీఎం తెలుసుకోనున్నారు. అక్కడి నుంచి 12.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్‌కు సీఎం చేరుకోనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసంకు సీఎం జగన్ చేరుకుంటారు.