అన్నదమ్ముల మధ్య బంగారం చిచ్చు పెట్టింది. బంగారం కోసం.. బంధాన్ని కూడా మర్చిపోయారు. ఏకంగా అన్న కుటుంబంపై తమ్ముడు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బంధాన్ని పక్కకు పెట్టి అన్నదమ్ములు కొట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది. ఇప్పటికే ఆస్తులు, డబ్బు కోసం.. సొంత అన్నదమ్ములు కూడా పోట్లాడుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాయి. ఇక తల్లిదండ్రుల ఆస్తుల కోసం వారసులు కోర్టుకెక్కిన దాఖలాలు కోకొల్లలు. సరిగ్గా ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది..
YSRCP: నారా లోకేష్ ఆరోపణలు.. వైసీపీ కౌంటర్..
అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు సహజం. కానీ ఆస్తి కోసం కొట్టుకోవడం మాత్రం కొన్ని ఘటనల్లోనే జరుగుతుంది. బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలోనూ ఇద్దరు అన్నదమ్ముల ఆస్తి కోసం పోట్లాడుకున్నారు. గత కొంత కాలంగా.. తల్లి బంగారం కోసం లక్ష్మీపురానికి చెందిన నాగిరెడ్డి, రామకృష్ణారెడ్డి మధ్య తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో… గొడవ పెరిగిన క్రమంలో అన్న నాగిరెడ్డి కుటుంబంపై తమ్ముడు రామకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు…
తమ్ముడు రామకృష్ణారెడ్డి తన అన్న నాగిరెడ్డి భార్య పద్మ, ఆయన కుమారుడు అంజిరెడ్డిపై బండరాళ్లతో దాడి చేశాడు. దీంతో ఈ దాడిలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పద్మను ఆమె కుమారుడు అంజిరెడ్డిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన పద్మ పరిస్థితి విషమంగా ఉందని నాగిరెడ్డి తెలిపారు. నాగిరెడ్డి ఫిర్యాదుతో దాడికి పాల్పడిన రామకృష్ణారెడ్డి, ఆయన భార్య కొడుకులపై కేసు నమోదు చేశారు బూర్గంపాడు పోలీసులు.. తల్లి బంగారం ఇద్దరు అన్నదమ్ములు తమ మధ్య సోదర భావాన్ని కూడా మర్చిపోయి విచక్షణారహితంగా కొట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది….
Bathukamma Festival: రేపటి నుంచి బతుకమ్మ సందడి.. అసలు బతుకమ్మ కథ ఏంటో తెలుసా!