అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు, సభ నిర్వహణపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై ఉత్కంఠకు తెరపడింది. ప్రముఖ విద్యావేత్త, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం, అలాగే మైనారిటీ నాయకుడు, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ల పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు తెలంగాణ కేబినెట్ ఆమోదించింది.
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చిట్ చాట్ జరిగింది. రేపు అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇద్దరు నేతలు సరదాగా మాట్లాడుకున్నారు.
ఆ మాజీ మంత్రి సొంత ఇంట్లోనే పరాయి వాడై పోయాడా? అట్టహాసంగా పార్టీ నాయకుడి పదవీ స్వీకార కార్యక్రమం జరిగితే... ఆయన్ని కనీసం పిలిచే దిక్కు లేకుండా పోయిందా? కాకితో కబురంపితే వెళ్తామనుకున్నా... కనీసం ఆ కాకి కూడా కరవైపోయిందా? ఎవరా సీనియర్ లీడర్?
హైదరాబాద్ నగరంలోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. కోదండరాం నగర్ రోడ్ నంబర్–7లో నివాసం ఉంటున్న జెల్లెల శేఖర్ (40), భార్య చిట్టి (33) గత కొంతకాలంగా హరీష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని పోలీసులు తెలిపారు.
నిమ్స్లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది.
జిల్లా మొత్తం మీద ఆయనొక్కడే పోటుగాడా? ఆ మాత్రం దమ్మున్న లీడర్స్ ఇంకెవరూ లేరా? ఒక్కడికే నాలుగు పదవులు ఎలా ఇస్తారు? ఇదీ... ప్రస్తుతం కాకినాడ జిల్లా జనసేన నేతల ఫ్రస్ట్రేషన్. ఇంతకీ ఎవరా నాలుగు పదవుల నాయకుడు?
తెలంగాణ విజిలెన్స్ కొత్త డీజీగా విక్రమ్ సింగ్ మాన్ తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ శాఖకు కొత్త డైరెక్టర్ జనరల్గా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 31తో పదవీ విరమణ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన విక్రమ్ సింగ్ మాన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేస్తున్నారు. […]
తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారమైన పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం, మొత్తం 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
పేరెంట్ డిపార్ట్మెంట్ వద్దు... పక్క శాఖ ముద్దు అంటున్నారా మహిళా అధికారి. తన సొంత శాఖకు ప్రమోషన్ ఇచ్చి పొమ్మన్నా పట్టించుకోకుండా ఆలయ ఈవోగానే కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి ఓ ప్రముఖ ఆలయ అధికారిగా ఉండేందుకు చివరిదాకా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన ఆ అధికారి ఎవరు?