CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న సీఎం మేడారంకు వెళ్లి క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. సమ్మక్క-సారలమ్మ పూజారులను సంప్రదించి, వారి సూచనలు, ఆమోదం తీసుకున్న తరువాతే అభివృద్ధి ప్రణాళికల డిజైన్లను విడుదల చేయాలని నిర్ణయించారు.
Bonda Uma and Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై బోండా ఉమా వరుస ట్వీట్స్.. వివాదం ముగిసినట్టేనా..?
సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్.. ఆలయ ఆవరణను మరింత విస్తరించాలనే పూజారుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలకు ఎటువంటి భంగం కలగకుండా తూచా తప్పకుండా గౌరవించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణాలు, డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన సంప్రదాయ వృక్షాలను నాటేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
మేడారం జాతర పనులను సమగ్రంగా పర్యవేక్షించేందుకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి మేడారంకు వెళ్లే సమయంలో మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు సంబంధిత అధికారులు కూడా పాల్గొననున్నారు. అక్కడే జాతర పనులపై సీఎం ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహించనున్నారు.
High Court: బిచ్చగాడిని భరణం కోరిన రెండో భార్య.. హైకోర్టు కీలక తీర్పు..