HYDRA : అల్వాల్ మండలంలోని కౌకూరు ప్రాంతం వరద ముప్పు నుంచి బయటపడింది. కౌకూరుకుంట–నాగిరెడ్డికుంట మధ్య అనుసంధాన కాలువను హైడ్రా అధికారులు పునరుద్ధరించడం ఇందుకు కారణమైంది. కాలువకు అడ్డంగా గోడ నిర్మాణం జరిగిందని స్థానికులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హైడ్రా విచారణ జరిపి గోడ నిర్మాణం నిజమని నిర్ధారించింది. వెంటనే కూల్చివేత చర్యలు చేపట్టింది.
CM Revanth Reddy : గద్దెలు యథాతథంగా.. ఈ నెల 23న మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి..
గోడ తొలగించడంతో కౌకూరుకుంట నీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా నాగిరెడ్డికుంటకు చేరడం ప్రారంభమైంది. దీంతో వరద ముప్పు తప్పి, ఫార్చ్యూన్ టవర్స్, కౌకూరు గ్రామ నివాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో నీరు నిలకడ లేకుండా ప్రవహించడంతో ప్రజల్లో సంతోషం నెలకొంది. హైడ్రా నిర్ణయాన్ని అభినందిస్తూ స్థానికులు నినాదాలు, ప్లకార్డులు పట్టుకుని “Hydra Long Live” అంటూ ప్రదర్శన నిర్వహించారు. వరద ముప్పు నుంచి తప్పించేందుకు హైడ్రా తీసుకున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాయి.