రిజర్వేషన్ ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును బీఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సబ్‌ప్లాన్‌ను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు.
గ్లామర్ ప్రపంచంలో అర్ధశతాబ్దానికిపైగా హీరోగా కొనసాగడం అరుదైన విషయమని, ఆ ఘనత హీరో బాలక్రిష్ణకు దక్కిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
2500 ఇటుకల బిల్లు రూ. 1.25 లక్షలు! ఉత్తర్ ప్రదేశ్ లోని భాటియా గ్రామ పంచాయతీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2500ల ఇటుకల బిల్లులో ఏకంగా రూ. 1.25 లక్షలు వేశారు. సర్పంచ్, కార్యదర్శి సంతకం చేసిన ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పరిపాలనలో కలకలం మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భాటియా గ్రామంలో ఒక బిల్లులో 2500 ఇటుకల ధరను రూ.1.25 లక్షలుగా చూపించిన కేసు వెలుగులోకి వచ్చింది, ఇది ప్రభుత్వ […]
కామారెడ్డిలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి వివాదస్పదంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "ప్రళయం, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఏమీ చేయలేరు" అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌ను బీజేపీ కంచుకోటగా మలచామని, GHMC ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన విషయమే దీనికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి మంచి ఓటు షేర్ రావడం ప్రజలు ప్రత్యామ్నాయంగా కేవలం బీజేపీనే భావిస్తున్నారని ఆయన అన్నారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఒకే రోజు పరిమితం చేయడం పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు.
ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలి తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చిట్ చాట్ జరిగింది. రేపు అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇద్దరు నేతలు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, “మా స్టార్ బ్యాట్స్‌మన్ నువ్వే” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి చెప్పగా, వెంటనే స్పందించిన కోమటిరెడ్డి, “మా కెప్టెన్ నువ్వే” అంటూ ఉత్తమ్‌ను […]