CMRF CHEATING : తెలంగాణ ప్రభుత్వ ఖజానాకే కన్నం
- సీఎం రిలీఫ్ ఫండ్ !! ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం
- అలాంటి డబ్బులను కూడా కాజేశారు కేటుగాళ్లు
- కరీంనగర్ జిల్లా గోదావరిఖని రవి స్వస్థలం
- బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఓ మంత్రి పేషీలో పని చేశాడు
- సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్స్ చూసేవాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వ ఖజానాకే కన్నం వేశారు కేటుగాళ్లు. నకిలీ పత్రాలతో ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులను కాజేశారు. ఆపదలో ఉన్నవారికి అందాల్సిన డబ్బులను తమ అకౌంట్‌లో జమ చేసుకున్నారు నకిలీగాళ్లు. కాజేసిన సొమ్మును తలా ఇంత వాటాలేసుకుని పంచుకున్నారు. గత ప్రభుత్వంలో ఓ మినిస్టర్ పేషీలో పనిచేసిన ఓ కంత్రీ ఫెలో చేసిన మోసాన్ని కూపీ లాగారు పోలీసులు. సీఎం రిలీఫ్ ఫండ్ !! ఆపదలో ఉన్న వారికి ఇదో ఆపన్నహస్తం. ఆస్పత్రుల పాలైన.. ప్రాణాలు కోల్పోయిన లేదా విపత్తులో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఆర్థికంగా సహాయం అందించేదే సీఎం రిలీఫ్ ఫండ్. అలాంటి డబ్బులను కూడా కాజేశారు కేటుగాళ్లు. ఏకంగా తెలంగాణ ప్రభుత్వ ఖజానాకే కన్నం పెట్టారు. అసలైన బాధితులకు అందాల్సిన డబ్బులను తమ జేబుల్లో వేసుకున్నారు కొందరు కంత్రీగాళ్లు…
కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన వ్యక్తి పొట్ల రవి. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఓ మంత్రి పేషీలో పనిచేశాడు. మంత్రి వద్ద అన్ని పనులు చక్కబెడుతూనే.. సీఎం రిలీఫ్ ఫండ్‌కి సంబంధించిన ఫైల్స్‌ను కూడా చూసేవాడు. మంత్రి సిఫారసుతో మంజూరైన చెక్కులను బాధితులకు అందేలా చూసేవాడు… ఈ క్రమంలో బాధితులకు మంజూరైన 230 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కాజేశాడు పొట్ల రవి. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోగానే.. ఈ చెక్కులను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఇవన్నీ మంజూరైనా సరే.. లబ్ధిదారులకు పంపిణీ చేయని చెక్కులు. ఇందులో ఫాలోఅప్ చేయని లబ్ధిదారులను గుర్తించాడు. సీఎంఆర్‌ఎఫ్ కోసం అప్లై చేసి… ఆపై వస్తుందో రాదో అని ఆశలు వదులుకునే వాళ్లుంటారు. చెక్కులు మంజూరైన విషయం కూడా వారికి తెలియదు. రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తే తప్ప విషయం తెలియదు. అలాంటి 19 చెక్కులను తన వద్ద ఉంచుకున్నాడు పొట్ల రవి…
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ఈ 19 లబ్ధిదారుల పేర్లతో మ్యాచ్ అయ్యేలా… కొందరు నకిలీ వ్యక్తులను సృష్టించాడు పొట్ల రవి. వీళ్లే అసలైన బాధితులుగా.. వీళ్ల పేర్ల మీదే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంజూరు అయినట్లు నకిలీ డాక్యుమెంట్లు రెడీ చేశాడు. వీటి ద్వారా ఆ 19 చెక్కులకు చెందిన 8 లక్షల 71 వేల రూపాయలను నకిలీ వ్యక్తుల ఖాతాల్లో జమ అయ్యేలా చేశాడు… ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. నకిలీగాళ్లంతా కలిసి ఆ డబ్బులను తలా ఇంత పంచుకున్నారు. పక్కా సమాచారం ఉన్న జూబ్లీహిల్స్ పోలీసులు కూపీ లాగారు. డొంక కదిలింది. కంత్రీ గాళ్ల నకిలీ బాగోతం బయటపడింది. అసలు సూత్రధారుడు పొట్ల రవితోపాటు.. లబ్ధిదారులుగా నటించిన జనగామ నాగరాజు, మాటేటి భాస్కర్, ధర్మారం రాజు, కాంపల్లి సంతోష్, చిట్యాల లక్ష్మి, అసంపెల్లి లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వారి కోసం గాలిస్తున్నారు… దుర్వినియోగం ఐన నిధులను తిరిగి స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నామని.. వీటిని అసలైన లబ్ధిదారులకు అందేలా చూస్తామంటున్నారు పోలీసులు…
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!