మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మూడవరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బోరవెల్లి గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను సీఎం కేసీఆర్ ప్రశాంతంగా ఉండనివ్వడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో […]
తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన చుట్టూ ఉన్నవారికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నా అని ముందుంటారు. మొన్నామధ్య ముడిమ్యాల క్యాసారం గేట్ల మధ్య ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అదే సమయంలో వికారాబాద్ పర్యటన ముగించుకుని మొయినాబాద్ వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రమాద స్థలం వద్ద తన కాన్వాయ్ అపి క్షతగ్రాతులను ప్రత్యేక వాహనంలో తరలించారు. అంతేకాకుండా ఆ తరువాత ఆ ప్రమాదంలో గాయపడ్డ వారి యోగక్షేమాలపై ఆరా […]
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన టీ.కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈ సీనియర్ల సమావేశంలో వాడి వేడిగా జరిగినట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులకు టాగూర్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. టైం సెన్స్ లేకుంటే పద్దతి కాదని, 11 గంటలకు మీటింగ్ అంటే… పనెండున్నర కి రావడం ఏంటి..? మాణిక్కం ఠాగూర్ ప్రశ్నించారు. మీకు సమయం విలువ తెలియకపోవచ్చు…మాకు టైం ఇంపార్టెంట్ తెలుసన్న ఠాగూర్.. వరుసగా మూడు సమావేశాలకు రాకుంటే… నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. […]
జోగులాంబ గద్వాల జిల్లా నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉండవెళ్లి మండలం మారమునుగాల దగ్గర బండి సంజయ్ పాదయాత్ర విరామ సమయంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పాదయాత్రలో ప్రజలు కష్టాలు చెప్పుకోవడానికి బీజేపీ పార్టీ వచ్చిందని సంతోషిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు పేదలకు చేరడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామంలోని యువకులు నిరుద్యోగ […]
ప్రజల్లోకి వెళ్లేందుకు టీఎస్ ఆర్టీసీ కొత్తకొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు మరో అడుగు వేస్తోంది టీఎస్ఆర్టీసీ. ఇప్పటికే పలు విధాల కార్యక్రమాలతో ఆర్టీసీని అందుబాటులోకి తీసువచ్చారు. టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువచ్చేందు నిర్వారామంగా కృషి చేస్తున్నారు. నిత్యం ట్విట్టర్ స్పందిస్తూ.. ప్రయాణికుల సమస్యలే కాకుండా.. ఆర్టీసీ ఉద్యోగల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు. అయితే తాజాగా టీఎస్ఆర్టీసీలో ప్రయాణిస్తే […]
బైజూస్ యాజమాన్యంలోని ఆన్లైన్ కోడింగ్ ప్లాట్‌ఫారమ్ వైట్‌హాట్ జూనియర్ (WhiteHat Jr) 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,690 కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. అదే సమయంలో రూ. 484 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని ఆర్జించింది. రిజిస్ట్రార్స్ ఆఫ్ కంపెనీస్ (ROC)కి దాఖలు చేసిన వార్షిక ఆర్థిక నివేదికలలో కంపెనీ బ్యాలెన్స్ షీట్ 2021ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయాలు రూ. 483.9 కోట్లుగా ఉంది. అలాగే 2020 అర్థిక సంవత్సరంలో రూ. 19 కోట్లుగా ఉంది. […]
మల్యాల మండలం కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా హనుమాన్ జయంతి వేడుకలకు హాజరుకాలేకపోయిన భక్తులు శుక్రవారం రాత్రి నుండి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ప్రారంభించారు. అంజన్న సన్నిధిలో దీక్ష విరమించడానికి చిన్న హనుమాన్ జయంతి పవిత్రమైన రోజు అని బలంగా నమ్ముతున్నందున హనుమాన్ దీక్షను తీసుకున్న భక్తులు కొండగట్టు ఆలయంలో దీక్ష విరమించారు. అంజనేయ స్వామి దీక్షదారులతో కొండగట్టు […]
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శించుకునేందకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే వారంతంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వారాంతంలో తిరుపతికి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెలవు రోజుల్లో అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) […]
తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ మే 4, 5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. మే 4న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 5వ తేదీన బోయిన్‌పల్లిలో కార్యకర్తలతో సమావేశమవుతారు. దీంతో రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ మదు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ […]