తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ.. వైసీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని టీడీపీకి అమ్ముకున్న చరిత్ర ఆదిరెడ్డి కుటుంబానిది అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఏ మోహం పెట్టుకుని రాజమండ్రి ప్రజలను ఆదిరెడ్డి కుటుంబం ఓట్లు అడుగుతారని ఆయన విమర్శించారు.
రాజమండ్రి కార్పొరేషన్ నుంచి సర్వం నాకేసారని ఆయన ఆరోపించారు.
చివరికి సొంత వాహనాల్లో డీజిల్ కూడా కార్పోరేషన్ నిధులు వినియోగించారని, మోరంపూడి జంక్షన్ ను అభివృద్ధి చేసి తీరతామన్నారు. అక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడతామని, అవసరమైతే నా ఆస్తులు అమ్మి మోరంపూడి వంతెన నిర్మాణం చేస్తానని ఆయన వెల్లడించారు. జక్కంపూడి రాజా.. చందన నాగేశ్వర్ లను కలుపుకుని రాజమండ్రిలో పార్టీని బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు. రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయాన్ని సీఎం జగన్ కు కానుకగా ఇస్తామని ఆయన పేర్కొన్నారు.