ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని కమిషన్ అంటోందని ఆరోపించారు. దీనిపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ టి. రంగరావు స్పందిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు నేను విద్యుత్ సంస్థలకు చేసిన సలహాలు, సూచనల కాపీని పంపిస్తాను. ఆయన చదువుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. రఘునందన్ రావు విద్యుత్ మీటర్ల బిగింపు పై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గత నెలలో విద్యుత్ టారిఫ్ ఆర్డర్ […]
ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకను హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు హెచ్ఐసీసీలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై సలహాలు, సూచనలు స్వీకరించామని, ప్లీనరీని విజయవంతం చేయడానికి కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకోవడం […]
తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్ ఆదివారం గౌహతి నుండి షిల్లాంగ్‌కు టాక్సీలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) ఒక ప్రకటనలో తెలిపింది. 83వ సీనియర్ జాతీయ, అంతర్ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు షిల్లాంగ్‌కు విశ్వ దీనదయాళన్ తన ముగ్గురు సహచర క్రీడాకారులతో కలిసి గౌహతి నుండి షిల్లాంగ్‌కు కారులో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న 12 చక్రాల ట్రైలర్, రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి […]
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం భువనగిరి మండలం తుక్కపురం గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతానికి చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. విద్యతో మనిషుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజనులకు, దళితులకు, బలహీన వర్గాలతో పాటు మైనార్జీలకు […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నేడు 5వ రోజుల జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఇటిక్యాల మండలం వేముల నుంచి పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంలో టీఆర్ఎస్ శ్రేణులు పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొంత మంది కార్యకర్తలు కిందపడిపోయారు. పోలీసులు రంగంలోకి […]
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ శనివారం లేఖ రాశారు. ఈ లేఖలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)ల కేటాయింపులను గురించి కేటీఆర్ ప్రస్తావించారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్‌ల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకు ఒక్కటంటే ఒక్క ఎస్టీపీఐని కేటాయించకపోవడం రాష్ట్రం పట్ల కేంద్రం వివక్షేనని ఆయన లేఖలో ఆరోపించారు. రాష్ట్రానికి ఎస్టీపీఐ ఇవ్వకుండా కేంద్రం చూపిన వైఖరితో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయని కేటీఆర్ […]
వానాకాలం సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోటి 42 లక్షల ఎకరాలలో వానాకాలం సాగు జరిగే అవకాశం ఉందన్నారు. 70 నుండి 75 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు, 50 లక్షల ఎకరాలలో వరి, 15 లక్షల ఎకరాలలో కంది, 11.5 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయారని […]
భారత గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పుడు మునుపు ఎన్నడూ లేని విధంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు దేశంలో జరిగిన 49 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 39 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, సార్వత్రిక ఎన్నికలలో కూడా హస్తం పార్టీ ప్రదర్శన అధ్వాన్నంగా ఉంది. 2014లో 44 సీట్లు, 2019లో 52 స్థానాలు మాత్రమే గెలవటం ఆ పార్టీ దుస్థితికి […]
తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గంగుల కమలాకర్ ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యం సీఎంఆర్‌లో రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎఫ్‌సీఐ సహకరించాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. అంతేకాకుండా ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దని, గన్నీలు, గోదాములు, ర్యాకుల కేటాయింపు పెంచాలని ఆయన విన్నవించారు. ప్రతీ నెల 9 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు. […]
మే 6,7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణకి వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు భరోసా ఇవ్వడం కోసం రాహుల్ గాంధీ వస్తున్నారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇక్కడ బాధ పడుతున్న వర్గాలకు అండగా ఉండాలని నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. రైతులు కల్లాల్లో గుండె ఆగి చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలు వేశాయని ఆయన మండిపడ్డారు. వరి వేస్తే ఉరి అని […]