టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఖమ్మంలో ఓ కార్యకర్తపై పీడీ యాక్ట్ పెట్టి వేధిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రతి లెక్కా తేలుస్తామని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. గ్రానైట్ వ్యాపారైన ఖమ్మంకు చెందిన ఎండీ ముస్తఫా (39) అనే కాంగ్రెస్ కార్యకర్తను […]
గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పై సీజేఐగా జస్టిస్ ఎన్వీ.రమణకు ప్రేమ, అభిమానం ఉంది కాబట్టే ఎన్నో రోజులుగా పరిష్కారంకాని సమస్యలను పరిష్కరించారన్నారు. ‘ఉమ్మడి హైకోర్టు విడిపోయాక బెంచీల సంఖ్య పెంపుపై గతంలో కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖ రాశాను. కానీ.. ఆ అంశం పెండింగ్ లోనే ఉండిపోయింది’. ‘సీజేఐగా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక […]
తెలంగాణ రాష్ట్రంలో నిన్న పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంది. దీంతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, ఉత్తర కుమార ప్రగల్బాలు టీఆర్ఎస్ నేతలు పలికారని ఆయన ఆరోపించారు. దేశానికే దిక్సూచి అని చెప్పారని, రైతులకు 3 గంటలు, 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనధికారికంగా అధికారులకు మౌఖిక […]
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ, మెడ్-టెక్ ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తోంది. ఆసియాలోనే అతి పెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన హైదరాబాద్‌లో రెడీ అయ్యిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సూల్తాన్‌పూర్‌లో సిద్ధమైన సహజానంద్ మెడికల్ టెక్నాలజీ పార్కుని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజ్ పార్కుని 302 ఏకరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రాంగణంలో ఇప్పటికే అనేక కంపెనీలు […]
కరోనా మహమ్మారి మలేషియా దేశంలో విలయ తాండవం చేస్తోంది. అక్కడ నిన్న ఒక్కరోజు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గురువారం అర్ధరాత్రి నాటికి మలేషియాలో 10,413 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు కోవిడ్ బాధితుల సంఖ్యం 43,63,024కు చేరుకుంది. అయితే వీటిలో విదేశాల నుంచి వచ్చిన వారు 27 మంది ఉండగా, స్వదేశంలో 10,386 మందికి ఈ కరోనా సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ […]
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ, గ్రామ సర్పంచ్ జాతీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్వశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ లింగన్న గౌడ్‌ను శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కరోనాతో మరణించిన వ్యక్తిని స్వయంగా ట్రాక్టర్ పై తీసుకెళ్లి సర్పంచ్ లింగన్న గౌడ్ అంతక్రియలు చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ పల్లెలకు […]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను నిన్న ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రి కేటీఆర్ బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర పైన మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని.. జుటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అని వ్యాఖ్యలు చేశారు. ‘‘పచ్చ బడుతున్న పాలమూరుపై కచ్చ కట్టిన మీకు.. అక్కడ అడుగుబెట్టే హక్కులేదు. కృష్ణా జిలాల్లో తెలంగాణ వాటా […]
క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. అయితే ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 15న అంటే నేడు క్రైస్తవులందరూ జరుపుకుంటున్నారు. గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి వద్ద ఆయన మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక ప్రత్యేక రోజు. పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే ఆచరించబడుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా […]
ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీరులేక మోడువారిపోతే ఆ రైతన్న మనోవేధన వర్ణానాతీతం. అయితే నిన్న రాష్ట్రంలో పలు చోట్ల వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో రోజురోజు విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తోంది. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి కావాల్సినంత త్రీఫేజ్ విద్యుత్ అందుబాటులో లేదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు […]
ముస్లింలకు ఎంత పవిత్రమైన మాసం రంజాన్ నెల. ఈ రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్దలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తుంటారు. అయితే రంజాన్ వచ్చిదంటే చాలు.. పట్టణాల నుంచి గ్రామాల వరకు వివిధ రకాల వంటకాలు దర్శనమిస్తుంటుయి. ఇది హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. పత్తర్‌కా ఘోష్ లాంటి ఎన్నో అరుదైన వంటకాలను ఈ రంజాన్ మాసంలో టేస్ట్ చేయవచ్చు. అయితే రంజాన్ నెలలో కేవలం ముస్లింలే కాకుండా మాంసాహార ప్రియులందరూ ఈ వంటకాలను ఆస్వాదిస్తుంటారు. ఎన్ని వంటకాలు […]