మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘కరణ్ అర్జున్’. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి మేకల కాగా, డా.సోమేశ్వరరావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్‌లు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు పరశురామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ…“కరణ్ అర్జున్` టైటిల్ తో పాటు ఫస్ట్ […]
తెలంగాణ గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ ప్రొటోకాల్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీలో గవర్నర్ తమిలిసై మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆధారాలు లేకుండా విమర్శిస్తున్నారని, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శించారని ఆయన ఆరోపించారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని, నేను ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా అని ఆమె ప్రశ్నించారు. ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని, ఏ పదవిలో ఉన్నా, […]
సంగారెడ్డి పట్టణ కేంద్రంలో దళిత యూనిట్లను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు దేశానికి ఆదర్శమని కొనియాడరు. రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓట్లు తప్ప ప్రజల అభివృద్ధి అవసరం లేదని ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే కర్ణాటక, ఛత్తీస్గడ్లతోపాటు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దళిత బంధును అమలు చేయండని […]
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాళేశ్వరం త్రివేణి సంగమానికి భక్తుల తాకిడి కొనసాగుతుంది. ప్రాణహిత పుష్కరాల 6వ రోజు సందర్భంగా కాళేశ్వరానికి భక్తుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాలతోపాటు మహరాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకొని త్రివేణి సంగమ గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. నదిమా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ.. దీపాలు వదులుతున్నారు. తీరంలో పురోహితులతో పిండ, శ్రాద్ధ కర్మ పూజలు నిర్వహిస్తున్నారు. […]
NTV Specials : రాజన్న.. ఈ ‘వీఆర్ఏ’ పరిస్థితి ఎందన్న.. పేదల దైవంగా.. కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల దేవుడు శ్రీరాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలోనే ఓ అవమానీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా. రెవెన్యూ విభాగంలో వీఆర్ఏగా పనిచేస్తున్న ప్రశాంత్ అధికారుల ఆదేశాలతో ప్రతిరోజు ఉదయం వేములవాడలోని ఆర్డీవో కార్యాలయాన్ని శుభ్రం చేసి తిరిగి తన విధులకు వెళ్తున్నాడు. వేములవాడలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసి దాదాపు 10 నెలలు గడుస్తున్నా సిబ్బందిని […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు 5వ రోజు జోగులాంబ జిల్లాలోని ఇటిక్యాల మండలంలో బండి సంజయ్ యాత్ర కొనసాగుతుండగా టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కార్యకర్తలపై దాడికి యత్నించినట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ శ్రేణులు మద్యం సేవించి యాత్రను […]
తెలంగాణలో ఈవీ (ఎలక్రిక్ వెహికల్) ఛార్జర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని రాపిడ్ ఈవీ చార్జ్-ఈ (RapidEVChargE) యోచిస్తోంది. ఎలక్ట్రికల్ ఛార్జర్ల తయారీ మరియు సంబంధిత సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందించడంలో ఉన్న రాపిడ్ ఈవీ ఛార్జ్-ఈ, తెలంగాణ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. రాపిడ్ ఈవీ ఛార్జ్-ఈ ప్రస్తుతం కోయంబత్తూరులో ఛార్జర్లను తయారు చేస్తోందని కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి శివసుబ్రమణ్యం తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో […]
ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని కమిషన్ అంటోందని ఆరోపించారు. దీనిపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ టి. రంగరావు స్పందిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు నేను విద్యుత్ సంస్థలకు చేసిన సలహాలు, సూచనల కాపీని పంపిస్తాను. ఆయన చదువుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. రఘునందన్ రావు విద్యుత్ మీటర్ల బిగింపు పై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గత నెలలో విద్యుత్ టారిఫ్ ఆర్డర్ […]
ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకను హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు హెచ్ఐసీసీలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై సలహాలు, సూచనలు స్వీకరించామని, ప్లీనరీని విజయవంతం చేయడానికి కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకోవడం […]
తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్ ఆదివారం గౌహతి నుండి షిల్లాంగ్‌కు టాక్సీలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) ఒక ప్రకటనలో తెలిపింది. 83వ సీనియర్ జాతీయ, అంతర్ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు షిల్లాంగ్‌కు విశ్వ దీనదయాళన్ తన ముగ్గురు సహచర క్రీడాకారులతో కలిసి గౌహతి నుండి షిల్లాంగ్‌కు కారులో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న 12 చక్రాల ట్రైలర్, రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి […]