యాసంగి ధాన్నాన్ని నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం కొనుగోళు చేయనుంది. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పండిన ధాన్యం కేంద్రం కొనాల్సి ఉన్నా కొనకపోవడంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పండిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిలా రైతులు నష్టపోవద్దనే ఈరోజు నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారని ఆయన […]
యాసంగి వరిధాన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత వచ్చింది. అయితే కేసీఆర్ ప్రకటనతో సీఎస్ సోమేశ్ కుమార్ అధికార యంత్రాంగానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ విషయమై జిల్లా కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో నేటి నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద యాసంగి కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది.
రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నారు ప్రజలు. ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ భారత విపణిలోకి ప్రవేశించాయి. టూ వీలర్స్ మాత్రమే కాకుండా ఎలక్రిక్ కార్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. దేశీయంగా మోటార్స్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న టాటా ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే.. కొత్త కొత్త మోడల్స్తో […]
వేసవికాలం వచ్చేసింది. ఎండాకాలం ప్రారంభం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత అధికమవుతున్న వేళ.. ఎక్కువగా డీహైడ్రేషన్కు గురవుతుంటారు. దీంతో డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు నిమ్మరసం, మంచినీళ్లు, ఫ్రూట్ జ్యూస్లు, కొబ్బరి నీళ్లలాంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ద్రవపదార్థాలేకాకుండా కొన్ని రకాల ఘనపదార్థాలు కూడా డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆకు కూరలు : వేసవికాలంలో డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగించే ఘన పదార్థాలలో ఆకు కూరలు కూడా ప్రధాన పాత్ర […]
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను అధికారులు భద్రపరచారు. వారిలో ఒకరిని బంధువు గుర్తించడంతో మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తరువాత అసలు విషయం తెలిసి అందరూ షాక్కు గురయ్యారు. ఓజీహెచ్ మార్చురీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వేర్వేరు కేసుల్లో మృతదేహాలను మైలార్దేవ్పల్లి, ఎస్ఆర్నగర్ పోలీసులు మార్చురీకి తీసుకొచ్చి గుర్తింపు కోసం ఉంచారు. అయితే గురువారం ఓ బంధువు వచ్చి ఒక మృతదేహాన్ని గుర్తించడంతో అధికారులు మృతదేహాన్ని కుటుంబ […]
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీలు రీషెడ్యూల్ చేయబడ్డాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ 2022 వెబ్సైట్లో జారీ చేసిన తాజా సర్క్యులర్లో, ఇప్పుడు పరీక్షను ఆగస్టు 28 ఆదివారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) బాంబే తేదీలను సవరించింది. గతంలో జులై 3న పరీక్ష జరగాల్సి ఉండగా.. పరీక్ష కింద ఉన్న రెండు పేపర్లను ఒకే రోజు నిర్వహిస్తారు. తొలి టెస్టు […]
ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గత సంవత్సరం పాదయాత్ర ప్రారంభించారు. అయితే నేటి నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి రెండో దశ ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. అయితే నేడు డా. బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జోగులాంబ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి దళితుడిని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీ, మోడీది అని ఆయన కొనియాడారు. అంబేద్కర్ స్పూర్తితో […]
వేసవికాలం భానుడి తాపానికి ప్రజలందరూ చెమటలు కక్కుతున్నారు. సూర్యోదయం నుంచే కూలర్లు, ఏసీలు తిరుగుతూనే ఉన్నాయి. అయితే భానుడి భగభగ నుంచి కూల్ చేసే విషయాన్ని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రాంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో గంటకు […]
యాసంగిలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా క్వింటల్ ధాన్యానికి ధర రూ.1960గా నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తన బాధ్యత విస్మరించినా.. రైతు మీద ప్రేమతో ముఖ్యమంత్రి కేసిఆర్ ధాన్యం సేకరణ చేస్తున్నారని ఆయన అన్నారు. యాసంగి ధాన్యం నూక శాతం నష్ట భారం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని […]