భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ సజావుగా సాగేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా అందించేందుకు గాను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విస్తృత ఏర్పాట్లు చేసిందని ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ తెలిపారు. 33 /11 కేవీ మీర్ ఖాన్ పేట్ సబ్ స్టేషన్ నుండి సదస్సు జరిగే ప్రాంతానికి ప్రత్యేకంగా రెండు కిలో మీటర్ల నిడివి కలిగిన డబుల్ సర్క్యూట్ […]
Messi vs CM Revanth : హైదరాబాద్ మహానగరం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. ఫుట్బాల్ ప్రపంచ దిగ్గజం లియోనల్ మెస్సీ భాగస్వామ్యంతో కూడిన ఫ్రెండ్లీ మ్యాచ్ డిసెంబర్ 13న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఓవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుండగా, మరోవైపు ఈ ఫుట్బాల్ ఈవెంట్ నగరానికి మరింత గ్లోబల్ గుర్తింపును తీసుకురానుంది. ముఖ్యంగా, స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక జట్టుకు సారథ్యం వహించనుండటంతో ఈ మ్యాచ్పై దేశవ్యాప్తంగా […]
TPCC Mahesh Goud : బీజేపీ చేపట్టిన మహాధర్నాపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ విషయమై మాట్లాడే అర్హత బీజేపీకి, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రానికి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల మెప్పు పొందిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. Hindu Rate Of Growth: […]
Scrub Typhus Ravaging AP: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్రత పెరిగింది. పురుగు కుట్టడం ద్వారా సంక్రమించే ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో భయాందోళన వాతావరణం నెలకొంది. తాజాగా మరో వ్యక్తి మృతి చెందడంతో, స్క్రబ్ టైఫస్ కారణంగా సంభవించిన మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ తాజా మృతి కృష్ణా జిల్లాలో నమోదైంది. ఉయ్యూరు మండలం, మొదునూరు గ్రామానికి చెందిన 44 ఏళ్ల వ్యక్తి శివశంకర్, స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. ఈ […]
Additional CP Srinivas Interview : ఐ-బొమ్మ రవిని పట్టుకున్న హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, రవి పైరసీ సామ్రాజ్యాన్ని స్థాపించడం వెనుక ఉన్న వ్యక్తిగత కారణాలు, అతడి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ఈ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. రవికి ఎదురైన అవమానం మరియు తక్షణ ధనం సంపాదించాలనే కోరిక అతడిని ఈ మార్గాన్ని ఎంచుకునేలా చేసిందని సీపీ వివరించారు. రవి ఏనాడూ సంప్రదాయ ఉద్యోగాల కోసం ప్రయత్నించలేదని, క్విక్ మనీ సంపాదించాలనే […]
అల్లర్లు లేవు.. అంతా బాగానే ఉంది.. బాబ్రీ మసీదుపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు ఢిల్లీలో ఈరోజు ( డిసెంబర్ 6న) జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. తన పదవీకాలంలో రాష్ట్రంలో “అల్లర్లు లేవు, కర్ఫ్యూ లేదు, అంతా బాగానే ఉంది” అని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం యూపీలో నెలకొన్న శాంతి- భద్రతలు గతంలో ఉన్న అస్థిరతతో పోల్చితే పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. బలమైన పోలీసింగ్ వ్యవస్థ, బాధ్యతాయుత ప్రభుత్వంతో […]
ఆ మాజీ మంత్రి పార్టీ మారబోతున్నారా? ఇన్నాళ్ళు జగనన్నకు జై కొట్టిన ఆ చేతులు మరో పార్టీ జెండా పట్టుకోబోతున్నాయన్న ప్రచారంలో నిజమెంత? తరచూ నియోజకవర్గాలు మారుస్తూ తనతో పొలిటికల్ షటిల్ సర్వీస్ చేయిస్తున్నారన్న అసహనం ఆమెలో పెరుగుతోందా? నేను వైసీపీని వదలబోనని సదరు నేత చెబుతున్నా ప్రచారం మాత్రం ఎందుకు ఆగడం లేదు? లోగుట్టు ఏంటి? విడదల రజని….ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయిన లీడర్ కమ్ ఎక్స్ మినిస్టర్. […]
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ను అధికారులు శనివారం ప్రకటించారు. డిసెంబర్ 11 నుంచి 26వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. డిసెంబర్ 27 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు ఒక్కో పేపర్కు రూ.25 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించుకోవచ్చని వెల్లడించారు. Notices […]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి టెర్మినల్ నుంచి దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. పండుగలు, సెలవుల కారణంగా రైల్వేల్లో పెరిగిన రద్దీని తగ్గించేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు బయలుదేరనుంది. అలాగే, ఈ నెల 26వ తేదీ […]
మహిళల సొమ్ము కోట్లలో దండుకున్న దొంగలెవరు? బోగస్ గ్రూపులు పెట్టి లోన్లు తీసుకుని సొంత ఖాతాలకు మళ్ళించుకున్న దోపిడీ గాళ్ళకు ఆ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అండగా నిలబడుతున్నారా? అది కూటమిలో విభేదాల్ని పెంచుతోందా? ముఖ్య నేతలు ఇద్దరూ సీరియస్గా దర్యాప్తు జరిపించమని కోరుతుంటే… అసలు గోల్మాల్ గాళ్ళు ఎవరు? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏ నిధుల్ని కోట్లలో కొట్టేశారు? ఒంగోలు మెప్మాలో బోగస్ గ్రూపులు సృష్టించి కోట్లు స్వాహా చేసిన వ్యవహారం ఇప్పుడు స్టేట్ టాపిక్ […]