Bhuvanagiri: ఓటు వేయలేదని ఓటర్ల ఇళ్లపై బీరు సీసాలతో దాడి
- ఓటమి జీర్ణించుకోలేక ఓటర్లపై దాడి
- భువనగిరి వార్డులో అర్ధరాత్రి హంగామా
- బీరు సీసాలతో ఇళ్లపై దాడి ఆరోపణలు
- చీరలు రోడ్డుపై విసిరేసిన మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొన్నిచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పును గౌరవించాల్సింది పోయి, ఓటమిని జీర్ణించుకోలేని కొందరు అభ్యర్థులు ఏకంగా ఓటర్లపైనే దాడులకు దిగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలాంటి ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. భువనగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి స్వరూపరాణి ఓటమి పాలయ్యారు. తమకు ఓటు వేయలేదన్న కోపంతో ఆమె , ఆమె కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ వార్డులో తీవ్ర హంగామా సృష్టించారు. స్థానిక ఓటర్ల ఇళ్లపై ఖాళీ బీరు సీసాలతో దాడికి దిగారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ వీధిలో బీభత్సం సృష్టించడంతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Tejas Thackeray: మాజీ సీఎం కుమారుడికి సీరియస్..
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
అభ్యర్థి వర్గం చేసిన దాడులకు వార్డులోని మహిళలు కూడా అంతే ధీటుగా స్పందించారు. ఎన్నికలకు ముందు ప్రలోభాల్లో భాగంగా అభ్యర్థి తమకు పంచిన చీరలను, హాట్ బాక్సులను తీసుకువచ్చి రోడ్డుపైకి విసిరివేస్తూ నిరసన తెలిపారు. “ఓట్లు వేయలేదని దాడులు చేస్తారా? మీ గిఫ్టులు మాకు వద్దు” అంటూ మహిళలు అభ్యర్థి తీరును తీవ్రంగా ఎండగట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పును గౌరవించకుండా ఇలా దాడులకు దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!