Formula-E Car Race Case : ఫార్ములా-ఈ కార్ రేస్‌లో కీలక పరిణామం..
- ఫార్ములా-ఈ కార్ రేస్‌లో కీలక పరిణామం
- ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి
- ప్రాసిక్యూషన్ విషయంపై రాష్ట్రానికి సమాచారం ఇచ్చిన కేంద్రం
- ఫార్ములా-ఈ కార్ రేసుపై ఇప్పటికే విచారణ జరుపుతున్న ఏసీబీ
- మరోవైపు ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఫార్ములా-ఈ రేస్ నిధుల దుర్వినియోగం కేసులో విచారణ ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి, పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. దీంతో ఈ కేసులో ఏసీబీ (ACB) తదుపరి చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది.
Also Read
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసింగ్ కోసం దాదాపు రూ.54.88 కోట్ల ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ. క్యాబినెట్ అనుమతి లేకుండానే నిధులు విడుదల చేయడం. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఆమోదం లేకుండా విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరపడం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో నిధులు బదిలీ చేయడం వంటి అంశాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో అరవింద్ కుమార్‌ను ఏసీబీ రెండో నిందితుడు (A2)గా పేర్కొంది. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను నిధులు విడుదల చేశానని అరవింద్ కుమార్ గతంలో ఏసీబీ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అయితే, ఐఏఎస్ అధికారి కావడంతో ఆయనపై కోర్టులో విచారణ (Prosecution) చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (DoPT) అనుమతి తప్పనిసరి. తాజాగా కేంద్రం ఆ అనుమతిని మంజూరు చేయడంతో ఏసీబీ చర్యలు వేగవంతం చేయనుంది. కేసులో మొదటి నిందితుడు (A1)గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గత ఏడాది నవంబర్ 20నే అనుమతి ఇచ్చారు. కేటీఆర్‌తో పాటు అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీ.ఎల్.ఎన్ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చారు.
OpenAI: ChatGPTలో ‘Lockdown Mode’ ఫీచర్.. ఇక భద్రతకు ఢోకా లేదు..!
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!