V.K. Sasikala : తమిళ రాజకీయాల్లో చిన్నమ్మ నయా ఇన్నింగ్స్.. కొత్త పార్టీ ఏర్పాటుకు శశికళ రంగం సిద్ధం..
- శశికళ రాజకీయాల్లో చిన్నమ్మ నయా ఇన్నింగ్స్
- కొత్త పార్టీ కోసం చెన్నైలో వ్యూహాత్మక సమావేశాలు
- దక్షిణ తమిళనాడులో 40 నియోజకవర్గాలు టార్గెట్
- జయలలిత జయంతి రోజున పార్టీ పేరు, జెండా ప్రకటించవచ్చని అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆప్తమిత్రురాలు, అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వి.కె. శశికళ మళ్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆమె తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా చెన్నైలోని తన నివాసంలో గత కొన్ని రోజులుగా జిల్లా స్థాయి నేతలు, అనుచరులతో ఆమె వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తన ఆప్తమిత్రురాలు జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24న శశికళ తన కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండా , విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుతం అన్నాడీఎంకే నాయకత్వం పనిచేయడం లేదని, అందుకే కొత్త పార్టీ ద్వారా తమ ఉనికిని చాటాలని ఆమె మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుత చర్చల్లో శశికళ ప్రధానంగా రెండు మార్గాలపై దృష్టి సారించినట్లు సమాచారం. సరికొత్త పేరుతో రాజకీయ పార్టీని స్థాపించడం. ఆమె సోదరుడు 2018లో రిజిస్టర్ చేసిన ‘అన్నా ద్రావిడర్ కళగం’ (ADK) పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపడం.
Also Read
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని సుమారు 40 నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ శశికళ తన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో శిక్ష పడటంతో ఆమె 2027 వరకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలైనప్పటికీ, ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడానికి ఆమెకు చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు లేవు. జయలలిత జయంతికి ముందే ఆమె తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
IND vs PAK: టీమిండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓటమి.. పాక్ జట్టులో భారీ మార్పులు..!
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!