బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ వివాహం ఎట్టకేలకు నేడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో గ్రాండ్ గా జరుగుతున్నా ఈ పెళ్ళికి అతికొద్దిమంది అతిరధమహారథులు హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఎక్కువమందిని ఈ జంట పిలవలేదన్న సంగతి తెలిసిందే . అయితే ఈ పెళ్లి కోసం కత్రినా జంట ఎంత ఖర్చుపెట్టింది అనేది ప్రస్తుతం అభిమానులందర్నీ తోసులుస్తున్న ప్రశ్న.. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ అంటే మాటలు కాదు ఒక్కో […]
అల్లు అర్జున్ పుష్ప క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ , సాంగ్స్ హైప్ ని క్రియేట్ చేశాయి . ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచారు చిత్రబృందం . ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని […]
మెగాస్టార్ చిరు వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలలో నటిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’.. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీర్రాజు’ .. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాలలో ‘వాల్తేరు వీరయ్య’ స్టోరీ ఇదే అంటూ కొన్ని వార్తలు గుప్పుమంటున్నాయి. మెగా 154 గా మొదలైన ఈ చిత్రం అరాచకం ఆరంభం అంటూ ఫుల్ యాక్షన్ లోకి దింపేశారు. ఇక ఈ చిత్రంలో […]
‘బొమ్మరిల్లు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో హాసినిగా నిలిచిపోయింది జెనీలియా.. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్ దేశముఖ్ ను వివాహం చేసుకొని నటనకి దూరమైంది. ఇక పిలల్లు పుట్టాకా ఇంటిపట్టునే ఉంటూ వారి ఆలనా పాలన చూసుకోవడం మొదలుపెట్టింది. ఇక దీంతో పాటు భర్త బిజినెస్ లను చూసుకుంటూ బిజీగా ఉన్న జెనీలియా మరోసారి సినిమాలపై దృష్టి పెట్టనుంది. ఈ నేపథ్యంలోనే అమ్మడు రీ ఎంట్రీకి రంగం సిద్ధం […]
సమాజం మారుతోంది.. మహిళపై వివక్ష తగ్గుతోంది.. ఆడామగ ఇద్దరు సమానమే అనుకుంటున్నారు తల్లిదండ్రులు.. ఇక సమాజంలో స్త్రీల సంఖ్య పెరుగుతోంది అని ఆశించేలోపు ఎక్కడో ఒకచోట ఈ వివక్ష కనిపించడం బాధాకరమైన విషయం.. ఆడపిల్ల కడుపులో పెరుగుతోందని కడుపులోనే చంపేస్తున్నారు.. ఆడపిల్లలు పుట్టారని.. పుట్టినా వెంటనే గొంతు నులిమేస్తున్నారు.. తాజాగా ఒక తల్లి తనకు వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో.. మూడో బిడ్డను అతి కిరాతకంగా చంపిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. […]
రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. గురువారం రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటి ఛాలెంజ్ ని పూర్తిచేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ” పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు ఎంతో అవసరం .. […]
హీరోలంటే ఫ్యాన్స్ కి పిచ్చి… హీరోల కోసం ఫ్యాన్స్ ఎలాంటి పనులైనా చేస్తారు.. హీరోల సినిమాలు రిలీజ్ అయితే వారికి పండగే.. ఇక ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకొంది అంటే పూనకాలే.. థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తారు. వారి అభిమానం అలాంటిది. అయితే ఆ అభిమానం హద్దులు దాటకూడదు. సాధారణంగా డైరెక్టర్లకు మా హీరో సినిమా మంచిగా తీయకపోతే చంపేస్తాం.. ఎలివేషన్స్ సరిగ్గా లేకపోతే డైరెక్టర్లను ట్రోల్ చేయడం లాంటివి చూస్తూనే ఉంటాం.. కానీ […]
అకింత లోఖాండే.. సీరియల్ నటిగా బుల్లితెరకు పరిచయమై కంగనా నటించిన మణికర్ణిక చిత్రంతో బాలీవుడ్ వెండితెరకి ఎంట్రీ ఇచ్చిన భామ.. ఇక దీనికన్నా దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ‘పవిత్ర రిష్తా’ సీరియల్ టైమ్ లో వీరిద్దరి ప్రేమ చిగురించడం .. ఆ తరువాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో రిలేషన్ కి బ్రేకప్ చెప్పేశారు . ఇక సుశాంత్ బ్రేకప్ తరువాత 2019లో తాను […]
తెలుగు చిత్రసీమలో సి.కళ్యాణ్ అందరికీ తలలో నాలుకలా ఉంటారు. అందరివాడు అనిపించుకుంటారు. అందరితోనూ కలసి పోతుంటారు. సినిమా రంగంలో ఏ సమస్య వచ్చినా, అందుకు తగ్గ పరిష్కారం కోసం సినీపెద్దలతో చర్చించడంలోనూ, ప్రభుత్వాలతో మంతనాలు జరపడంలోనూ ముందుంటారు. ఒకప్పుడు చిన్న సినిమాల నిర్మాతగా పయనం మొదలుపెట్టి, నేడు అగ్రకథానాయకులతోనూ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరుకున్నారు సి.కళ్యాణ్. తెలుగు సినిమా రంగంలో పలు శాఖల్లో అధ్యక్షునిగా పనిచేసిన సి.కళ్యాణ్, ఒకప్పుడు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ గానూ సేవలు […]
ముక్కుసూటి తనానికి మారుపేరుగా నిలిచారు హిందీ స్టార్ హీరో శత్రుఘ్న సిన్హా! అందుకే ఆయనను బాలీవుడ్ లో అభిమానంగా ‘షాట్ గన్ సిన్హా’ అనీ పిలుస్తుంటారు. ‘బీహారీ బాబు’గానూ ఆయనకు పేరుంది. శత్రుఘ్న సిన్హా తనదైన విలక్షణ అభినయంతో ఆకట్టుకున్నారు. ‘మేధావి’ అనే తెలుగు చిత్రంలోనూ ఆయన నటించారు. తరువాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘రక్తచరిత్ర’లోనూ శత్రుఘ్న సిన్హా అభినయించారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ శత్రుఘ్న సిన్హా రాణించారు. దేశ […]