అల్లు అర్జున్ పుష్ప క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ , సాంగ్స్ హైప్ ని క్రియేట్ చేశాయి . ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచారు చిత్రబృందం . ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. డిసెంబర్ 12 న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
“థియేటర్లో కన్నా ముందే మాస్ పార్టీ.. మాస్ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతుందో ఒక చిన్న గ్లింప్స్.. పుష్ప మాస్సివ్ ప్రీ రిలీజ్ పార్టీ.. డిసెంబర్ 12 న” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ పోస్టర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ లుగా ఎవరు రానున్నారో చెప్పకపోవడంతో అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈవెంట్ కి గెస్ట్ లు ఎవరైనా వస్తున్నారా ..? అని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ ఈవెంట్ కి ప్రభాస్, చిరు, షాహిద్ కపూర్ గెస్టులుగా వస్తున్నారంటూ పుకార్లు వినిపించాయి.. కానీ, మేకర్స్ అందులో ఒక్కరిపేరు కూడా చెప్పకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.