పెళ్లి ఖర్చంతా కత్రినాదే.. విక్కీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ వివాహం ఎట్టకేలకు నేడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో గ్రాండ్ గా జరుగుతున్నా ఈ పెళ్ళికి అతికొద్దిమంది అతిరధమహారథులు హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఎక్కువమందిని ఈ జంట పిలవలేదన్న సంగతి తెలిసిందే . అయితే ఈ పెళ్లి కోసం కత్రినా జంట ఎంత ఖర్చుపెట్టింది అనేది ప్రస్తుతం అభిమానులందర్నీ తోసులుస్తున్న ప్రశ్న.. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ అంటే మాటలు కాదు ఒక్కో గది అద్దె ఒక్క రాత్రికి లక్ష వరకు ఉంటుందంట.. అయితే ఈ వివాహ వేదికకు కత్రినా జంట ఒక్క రూపాయి కూడా చెల్లించలేదట.. కరోనా తరువాత ఇప్పుడిప్పుడే వివాహాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ యజమాన్యం కూడా కత్రినా పెళ్లిని ఒక ప్రమోషన్ కింద వాడుకుంటున్నారట .. అందుకే వారి పెళ్ళికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం.
ఇక వివాహవేడుక కోసం చేసిన ఖర్చులో 75శాతం కత్రినా కైఫే భరించిందట. అతిధులను పిలవడం దగ్గరనుంచి వారి భోజనాల ఏర్పాట్లు, ఆతిథ్యం, ప్రయాణాలు, భద్రత ఏర్పాట్లు అన్ని కత్రినానే భరిస్తున్నదట .. ఈ వివాహ వేడుక కోసం విక్కీ ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని సమాచారం.. దీంతో నెటిజన్స్ మరోసారి కత్రినా ప్రేమను చాటిచెప్తున్నారు. ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇంతలా పెళ్లి ఖర్చు మొత్తం భరించాలా..? అని నోళ్లు నొక్కుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే ఈ జంట నోరు విప్పాల్సిందే.
Also Read
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!