Ghaati: ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. అంటూ కుర్రకారును తన అందాలతో మెస్మరైజ్ చేసిన సరోజ గుర్తుందా..? డబ్బు కోసం వేరే దారిలేక వేశ్యా వృత్తిలోకి వచ్చి.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, సొంతంగా ఎదగాలనుకొనే అమ్మాయి సరోజ. ఆ ప్రయాణంలో ఆమె ఎన్ని కష్టాలను ఎదుర్కొంది అనేది వేదం సినిమాలో చూపించాడు క్రిష్ జాగర్లమూడి.
Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే పవన్ - హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇన్నాళ్లకు ఈ కాంబో ఉస్తాద్ తో రాబోతుంది. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Kanguva Sizzle: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్న కంగువ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది.
Ustaad Bhagath Singh:దేశవ్యాప్తంగా ఎన్నికల నగార మోగింది.. ఏపీ ఎలక్షన్స్ హీటెక్కిపోతుంది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలారోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనే పర్యటిస్తూ.. సభలు ఏర్పాటు చేస్తూ.. పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన అప్ కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా.
Director Krish: క్రిష్ జాగర్లమూడి.. ఈ పేరు ఈ మధ్య వార్తల్లో బాగా నానిన విషయం తెల్సిందే. ర్యాడిసన్ బ్లూ హోటల్ లో జరిగిన డ్రగ్స్ రైడ్ లో క్రిష్ పేరు కూడా రావడంతో.. ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడంటే సినిమాల విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గాడు కానీ, ఒకప్పుడు క్రిష్ తీసిన సినిమాలు అన్ని అవార్డు విన్నింగ్ సినిమాలే.
Jayamailini: అలనాటి అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే.. సిల్క్ జీవితం ఒక పువ్వు లాంటిది. అందు ఆ పువ్వుని చూసారు కానీ, దానికింద ఉన్న ముళ్ళును మాత్రం ఎవరు చూడలేకపోయారు. ఆ ముళ్ళమీద నడుస్తూనే ఆమె చిరునవ్వులు చిందించింది.
Manchu Mohan Babu: భక్తవత్సలం నాయుడు.. ఈ జనరేషన్ లో ఈ పేరు చాలా తక్కువమందికి తెలుసు. అదే మోహన్ బాబు అని చెప్పండి.. టక్కున కలెక్షన్ కింగ్ అని చెప్పేస్తారు. సరే ఇంతకు భక్తవత్సలం నాయుడు.. ఎవరు అని అడుగుతారా.. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడే. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పేర్లు మార్చుకోవడం చూస్తూనే ఉంటాం. అలా భక్తవత్సలం నాయుడు.. కాస్తా మోహన్ బాబుగా మారారు. అసలు ఎలా ఒక పిటీ టీచర్.. కలెక్షన్ కింగ్ గా మారారు అనేది తెలుసుకుందాం.
Ravi Shankar Rathod: బుల్లితెర టాప్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. డైరెక్టర్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సీరియల్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి,వసుధార, జగతి, మహేంద్ర.. ఇలా వారి పాత్రలే పేర్లనే అభిమానులు సొంత పేర్లుగా మార్చేశారు. రిషిధార పేరుతో సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫ్యాన్స్ ఇంకెవరికి లేరు అనే చెప్పాలి.
Tillu Square: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Mukesh Khanna: ఇప్పుడంటే చిన్నపిల్లలు చూడడానికి చాలా వీడియో గేమ్స్, షోస్ వచ్చాయి కానీ, అప్పట్లో చిన్న పిల్లలు చూసిన ఒకే ప్రోగ్రామ్ శక్తిమాన్ . ఈ ప్రోగ్రామ్ కోసం పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎదురుచూసేవారు. చాలామంది చిన్నపిల్లలు తమను కాపాడడానికి శక్తిమాన్ వస్తాడని.. గోడల మీద నుంచి దూకేసిన రోజులు కూడా ఉన్నాయి.