Ravi Shankar Rathod: బుల్లితెర టాప్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. డైరెక్టర్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సీరియల్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి,వసుధార, జగతి, మహేంద్ర.. ఇలా వారి పాత్రలే పేర్లనే అభిమానులు సొంత పేర్లుగా మార్చేశారు. రిషిధార పేరుతో సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫ్యాన్స్ ఇంకెవరికి లేరు అనే చెప్పాలి. ఇక ఈ మధ్య ఈ సినిమా చాలా స్లోగా సాగుతున్న విషయం తెల్సిందే. రిషి మిస్ అవ్వడం.. అతను చనిపోయాడని అందరూ అనుకోవడం.. కానీ, వసుధార మాత్రం రిషి వస్తాడు అని నమ్మడం.. శైలేంద్ర, కాలేజ్ ను ఆక్రమించుకోవడానికి పథకాలు వేయడం.. ఇదంతా ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది. ఇక ఆ సమయంలోనే మరో హీరోలా దిగాడు మను. అనుపమ కొడుకుగా పరిచయం చేసినా.. వారిద్దరికీ మధ్య ఉన్న వైరం గురించి చూపించలేదు. ఇక మను వచ్చాకా సీరియల్ కొద్దిగా ఆసక్తిని క్రియేట్ చేసింది. శైలేంద్ర, రాజీవ్ కు కరెక్ట్ మొగుడుగా మనును చూపిన విధానం ఆకట్టుకుంటోంది. ఇక ఇంకోపక్క వసుధార కూడా .. మను మంచివాడని నమ్మడంతో.. మనుకు కూడా అభిమానులు గుప్పెడంత మనసు సీరియల్ ఫేవరేట్ లిస్ట్ లోకి తోసేశారు. దీంతో అసలు మను ఎవరు.. ? అని కనుక్కోవడం మొదలుపెట్టారు.
మను అసలు పేరు రవి శంకర్ రాథోడ్. అతను యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా. వేరే భాషకు చెందినవాడు కాకపోవడం విశేషం. ఈటీవీ లో నాలుగు స్తంభాలాట, మా టీవీలో గృహాలక్ష్మీ సీరియల్స్ లో నటించి మెప్పించాడు. అయితే రవికి బాగా పేరు తెచ్చింది మాత్రం గుప్పెడంత మనసు మాత్రమే. ఇక సీరియల్స్ మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కూడా రవి శంకర్ నటించాడు. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హనుమాన్ లో మను కూడా నటించాడు. అవును మీరు వింటుంది నిజమే.. రెండు, మూడు షాట్స్ కే పరిమితమయినా.. గుప్పెడంత మనసు సీరియల్ఇచ్చిన గుర్తింపుతో అతడిని గుర్తుపడుతున్నారు. హనుమాన్ లో వరలక్ష్మీని పెళ్లి చేసుకొనే పెళ్లి కొడుకుగా కనిపిస్తాడు. పెళ్లి మండపంలోనే ప్రేమించిన అమ్మాయి చనిపోతే ఆ బాధను కళ్ళలోనే చూపించే షాట్ లో మను అదరగొట్టాడు. ఇక ఈ సినిమా చూసిన వారందరూ.. సోషల్ మీడియాలో రవి శంకర్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇలాంటి మంచి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు. మరి ముందు ముందు రవి శంకర్ హీరోగా మారతాడేమో చూడాలి.