Mukesh Khanna: శక్తిమాన్ గా రణవీర్.. ఛీఛీ.. అతను శక్తిమాన్ ఏంటి.. ఒంటిపై బట్టలు లేకుండా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Khanna: ఇప్పుడంటే చిన్నపిల్లలు చూడడానికి చాలా వీడియో గేమ్స్, షోస్ వచ్చాయి కానీ, అప్పట్లో చిన్న పిల్లలు చూసిన ఒకే ప్రోగ్రామ్ శక్తిమాన్ . ఈ ప్రోగ్రామ్ కోసం పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎదురుచూసేవారు. చాలామంది చిన్నపిల్లలు తమను కాపాడడానికి శక్తిమాన్ వస్తాడని.. గోడల మీద నుంచి దూకేసిన రోజులు కూడా ఉన్నాయి. అంతలా శక్తిమాన్ పిల్లల మనస్సులో కొలువుండి పోయింది. ఇక శక్తిమాన్ గా నటించిమెప్పించిన నటుడు ముకేశ్ ఖన్నా. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ముకేశ్.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. తనకు నచ్చని విషయం అయితే నిర్మొహమాటంగా సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పుకొస్తాడు. ఇక గత కొన్నిరోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.. శక్తిమాన్ గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు కాస్తా ముకేశ్ వద్దకు వెళ్లగా .. ఆయన దీనిపై స్పందించాడు.
” నేను ఈ వార్తలపై స్పందించకూడదనే అనుకున్నాను. కానీ,నోరు విప్పక తప్పడంలేదు. ఇప్పటికే చాలామంది ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఇంకొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా ఇప్పటివరకు మౌనం వహించాను. కానీ, ఎప్పుడైతే ఛానల్స్ కూడా రణ్‌వీర్ శక్తిమాన్‌గా కనిపించనున్నాడని ప్రచారం మొదలుపెట్టాయో.. అప్పుడే ఇక నోరు విప్పక తప్పదని నిర్ణయించుకున్నాను. అయినా ఒంటిమీద నూలు పోగు లేకుండా ఫోటోషూట్లు చేసే వ్యక్తి శక్తిమాన్‌గా కనిపిస్తాడా? .. ఎంత పెద్ద స్టార్ అయితే ఏంటి లాభం. శక్తిమాన్ అంటే సూపర్ హీరో కాదు.. సూపర్ టీచర్ అని నొక్కి చెప్తున్నాను. రణవీర్.. నీకు నచ్చిన సినిమాలు నువ్వు చేసుకో.. కావాలంటే నిరంతలతో నేను మాట్లాడతాను. ఒక హీరో ఏదైనా పాత్ర చేస్తే జనాలు నమ్మాలి. వారు మాట్లాడితే నిజమనుకోవాలి. కొంతమంది పేరుకే స్టార్ హీరోలు.. కానీ ఇమేజ్ మాత్రం చాలా తక్కువ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
తాజావార్తలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!