Shock News to Samsung: శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం కింద ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలను నిలిపేసింది. ఆ కంపెనీ జనరేట్ చేసిన ఇన్‌వాయిస్‌లలో కొన్ని లోటుపాట్లు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ మరియు సేల్స్‌కి సంబంధించి శామ్‌సంగ్ ఇచ్చిన డేటాకి, కేంద్ర ప్రభుత్వం సేకరించిన సమాచారానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. ఈ పథకం కింద అర్హత సాధించిన ఏకైక సంస్థ శామ్‌సంగ్ తమకు 900 కోట్ల రూపాయలు వస్తాయని క్లెయిమ్ చేస్తుండగా అంత ఇవ్వాల్సిన పనిలేదని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
నేడు, రేపు ఇ-వేలం
దేశంలోని 10 బొగ్గు గనుల వాణిజ్య తవ్వకాల కోసం సంబంధిత మంత్రిత్వ శాఖ ఇవాళ, రేపు ఇ-వేలం నిర్వహించనుంది. ఈ రోజు 8 బ్లాకులకు, రేపు 2 బ్లాకులకు ఆక్షన్ చేపట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే బిడ్లు దాఖలు కాగా వాటి సాంకేతిక మదింపు పూర్తయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఇ-వేలానికి రూట్ క్లియరైందని పేర్కొన్నాయి. బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు 43 కోల్ మైన్స్‌లో ఏటా 85 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు తవ్వకాలకు ఆక్షన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ నిర్వహించే వేలంలో 39 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు తవ్వకాల కోసం వివిధ సంస్థలు పోటీపడనున్నాయి.
Flash Back-2: ఫీల్ గుడ్ సినిమాలు.. ‘సూపర్ గుడ్’ ట్యాగ్‌లైన్లు..
హైదరాబాద్ స్టార్టప్‌కి గ్రాంట్
హెల్త్ కేర్ సెక్టార్‌లో సేవలందిస్తున్న హైదరాబాద్‌కి చెందిన ఆంకోఫినామిక్స్ లైఫ్ సైన్సెస్ అనే స్టార్టప్ 65 లక్షల రూపాయల స్పెషల్ గ్రాంట్‌కి సెలెక్ట్ అయింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్‌తోపాటు ఫైజర్ సంస్థ సంయుక్తంగా ఈ గ్రాంట్‌ను ఏర్పాటుచేశాయి. తొలి విడతలో ఆరోగ్య రంగానికి సంబంధించిన 6 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. ఆయా సంస్థల డెవలప్‌మెంట్ కోసం ఫండ్స్, గైడెన్స్‌తోపాటు సాంకేతిక సహాయ సహకారాలను ఫైజర్ కంపెనీ అందించనుంది.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
వరుసగా రెండో రోజూ (ఇవాళ కూడా) స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 409 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ప్రస్తుతం 60524 వద్ద ట్రేడింగ్ అవుతోంది. 101 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 18038 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టీసీఎస్, జీ ఎంటర్టైన్మెంట్, ఓఎంసీస్, కోలిండియా తదితర సంస్థల షేర్లు ఆశాజనకంగా ఉన్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. స్టాక్స్ 6 శాతం ర్యాలీ తీశాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.49 వద్ద ఉంది.