YouTube Player For Education: ఎడ్యుకేషనల్ కంటెంట్ ఇంప్రూవ్‌మెంట్ కోసం త్వరలో ‘యూట్యూబ్ ప్లేయర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTube Player For Education: ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ యూట్యూబ్‌ను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు అందరూ ఆ వీడియోలను వీక్షిస్తూ టైంపాస్ చేయటమే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా పొందుతున్నారు. మనకు నచ్చిన విషయం (టాపిక్) ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలన్నా, దానిపై తేలిగ్గా, తొందరగా అవగాహన పెంచుకోవాలన్నా ఇప్పుడు ఇదో చక్కని మార్గంగా మారింది. దీంతో ఈ ప్లాట్‌ఫామ్‌పై ఎడ్యుకేషనల్ కంటెంట్‌ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా, ఇంటరాక్టివ్‌గా అందించటం కోసం యూట్యూబ్ పనిచేస్తోంది.
ఈ మేరకు త్వరలో యూట్యూబ్ ప్లేయర్ ఫర్ ఎడ్యుకేషన్‌ని అందుబాటులోకి తేనుంది. వ్యూయర్స్‌కి ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకునేందుకు అవకాశం కల్పించనుంది. విద్యార్థుల నిర్మాణాత్మక అభ్యసనం కోసం సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లు ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ని క్రియేట్ చేసేందుకు కూడా ఇందులో వీలుంటుంది. ఎడ్యుకేషనల్ ఎన్విరాన్‌మెంట్స్‌లో యూట్యూబ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఈ కొత్త ఉత్పత్తిని మార్కెట్‌లోకి తేనున్నట్లు ఇటీవల ప్రకటించింది. సాధారణంగా ఎడ్యుకేషన్ యాప్‌లలో లభించే స్టడీ మెటీరియల్‌నే ఈ యూట్యూబ్ ఎంబెడెడ్ ప్లేయర్‌లో నూతనంగా ప్రజెంట్ చేస్తారు.
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
Stock Market Performance: ప్రపంచ దేశాలతో పోల్చితే ఈవారం ఇండియా స్టాక్ మార్కెట్ పనితీరు.. సో బెటరు
కాకపోతే మధ్య మధ్యలో యాడ్‌లు, ఎక్స్‌టర్నల్ లింక్‌లు, రికమండేషన్లు, నోటిఫికేషన్లు, అలర్టులు, అప్‌డేట్‌లు తదితర డిస్టర్బెన్స్ ఉండవు. కాబట్టి ఆయా సబ్జెక్ట్ నోట్స్‌ని ప్రశాంతంగా చదువుకోవచ్చు. మెదడుకి మేతను అందించొచ్చు అని యూట్యూబ్ లెర్నింగ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ జొనాథన్ క్యాట్జ్‌మ్యాన్ అన్నారు. యూట్యూబ్ లెర్నింగ్ ప్రొడక్ట్‌కి తుది మెరుగులు దిద్దేందుకు, సాధ్యమైనంత తొందరగా విడుదల చేసేందుకు విద్య, సాంకేతిక రంగంలో పాతుకుపోయిన ఎడ్‌టెక్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటికే గూగుల్ క్లాస్‌రూమ్‌లో ఉన్న యూట్యూబ్ ఎంబెడెడ్ ప్లేయర్‌ని అప్‌డేట్ చేస్తామని చెప్పారు.
క్వాలిఫైడ్ క్రియేటర్స్ వ్యూయర్స్ కోసం.. వచ్చే సంవత్సరం నుంచి ఫ్రీ కోర్సులను లేదా పెయిడ్ కోర్సులను ఇన్‌డెప్త్(లోతు)గా ప్రారంభించేందుకు ఏర్పాటుచేస్తామని ఆయన పేర్కొన్నారు. యూట్యూబ్ సంస్థ ఈ దిశగా ప్రస్తుతం అమెరికాలోని ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీలైన ఎడ్‌పజిల్, పర్‌డ్యు యూనివర్సిటీ, పర్‌డ్యు గ్లోబల్‌తో కలిసి పనిచేస్తోంది. ‘యూట్యూబ్ ప్లేయర్ ఫర్ ఎడ్యుకేషన్’లో ఈ కోర్సులు ముందుగా అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో బీటా వెర్షన్‌లో వీక్షకుల ముందుకు రానున్నాయి. ఆ తర్వాత మరిన్ని దేశాలకు విస్తరిస్తారు. వ్యూయర్స్ తమ జనరల్ నాలెడ్జ్‌ని పెంచుకునేందుకు ఉపయోగపడే క్విజ్‌లను కూడా ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!