Mahabharatam Theme in Office: తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. ఎందుకంటే.. అదొక మహాకావ్యం. భారత ఇతిహాసం. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. పర్వం అంటే చెరుకు కణుపు. అందుకే ఈ పంచమ వేదాన్ని పంచదార తీపితో పోల్చారు. చెరుకు గడను నమిలేకొద్దీ రసం నోటిలోకి వచ్చి నోరు తీపవుతుంది. అలాగే భారతాన్ని చదివేకొద్దీ జ్ఞానం పెరుగుతుందని చెబుతారు. అనేక క్యారెక్టర్లు కలిగిన ఈ అద్భుత రచన అన్ని వర్గాలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది.
ఈ క్రియేషన్.. ఎవ్వర్‌గ్రీన్. కాబట్టే దీని ఆధారంగా ఎన్నో సినిమాలు, సీరియల్స్, వెబ్‌సిరీస్‌లు రూపొందుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఐస్ప్రౌట్(I SPROUT) అనే ఆఫీస్ స్పేస్ ప్రొవైడర్ ఈ మహాభారతం థీమ్‌ని అడాప్ట్ చేసుకుంది. ఈ సంస్థ తాజాగా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఒక కొత్త ప్రీమియం బిజినెస్ సెంటర్‌ను ఓపెన్ చేసింది. ఇది ఐస్ప్రౌట్‌కి దేశవ్యాప్తంగా పదో సెంటర్ కాగా హైదరాబాద్‌లో ఆరోది. దాదాపు 85 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 వందల సీట్లతో ఆఫీస్ స్పేస్‌ను అందిస్తోంది.
Flash Back-2: ఫీల్ గుడ్ సినిమాలు.. ‘సూపర్ గుడ్’ ట్యాగ్‌లైన్లు..
యూనిక్‌గా డిజైన్ చేసిన ఈ లేటెస్ట్ సెంటర్‌లో అడుగడుగునా మహాభారతం పెయింటింగ్స్ దర్శనమిస్తాయి. ‘‘మహాభారతం నుంచి కార్పొరేట్ ప్రపంచం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. వ్యూహాలు, టీమ్ లీడర్‌షిప్, కరక్ట్ అలయెన్స్.. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. మహాభారతంలో కృష్ణుడు ఎటువైపు ఉంటే అటువైపు వాళ్లే గెలుస్తారు. ఆయన్ని ఒక కూటమిలోకి తీసుకురావటం అనేది అంత తేలికైన విషయం కాదు. మన హిస్టరీ నుంచి, మన ఎపిక్స్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మన ఆఫీస్ స్పేస్‌లో చూపించకూడదు అని మేం అనుకున్నాం.
అయితే ఈ విషయంలో మేం కూడా తొలుత కొంత సందేహించాం. విదేశాల నుంచి క్లయింట్స్ వస్తారు. వాళ్లకు ఈ థీమ్ అర్థమవుతుందా లేదా అని ఆలోచించాం. అయితే ఈ వెరైటీ కాన్సెప్ట్‌కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఇతర దేశాల వారికి కూడా నచ్చుతుందనే నమ్మకం కలుగుతోంది. మహాభారతంలో ఉన్న గొప్ప గొప్ప పాత్రల గురించి చాలా మందికి తెలియదు. ఇక్కడికి వచ్చాక వీటిని చూసి వాళ్లు అర్థంచేసుకోవటానికి ప్రయత్నిస్తారనిపిస్తోంది. ఆ అంశమే మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’’ అని ఐస్ప్రౌట్ సంస్థ ప్రతినిధులు చెప్పారు.