Perks cut in Google: టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థగా వెలుగొందుతున్న గూగుల్‌లో కొంత మంది ఉద్యోగుల ప్రోత్సాహకాలకు కోతపడనున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే తప్ప బిజినెస్ ట్రావెల్స్‌కి అనుమతివ్వొద్దని సీనియర్ మేనేజర్లకు పైనుంచి మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోషల్ ఫంక్షన్లు, టీమ్ ఆఫ్‌సైట్‌లు, ఇన్-పర్సన్ ఈవెంట్స్‌కి ఇకపై అప్రూవల్ ఇవ్వబోమంటూ గూగుల్ ఉన్నతాధికారులు ఎగ్జిక్యూటివ్‌లకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Hyderabad's Reality Boom: హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం కరోనా ప్రభావం నుంచి గణనీయంగా కోలుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు (8 నెలల్లోనే) 22 వేల 680 కోట్ల రూపాయల విలువైన 46,078 రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు సేల్ అయ్యాయి. ఆగస్టు నెలలో 5,181 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. జులై నెలతో పోల్చితే ఇది 20 శాతం ఎక్కువ కావటం చెప్పుకోదగ్గ విషయం. జులైలో ఆషాఢం వల్ల ఇళ్ల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు.
Stock Market Introduction: స్టాక్ మార్కెట్ అంటే ఏంటి?. ఈ ప్రశ్నకు చాలా మంది సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు. న్యూస్ పేపర్లు చదవటం ద్వారానో, టీవీల్లో వాణిజ్య వార్తలు వినటం ద్వారానో కొద్దో గొప్పో అవగాహన పొందుతారు గానీ పూర్తిగా వివరించలేరు. అందుకే.. స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు పోగొట్టుకునే ఒక జూదం లాంటిది అనే అపోహలు ప్రజల్లో ఉన్నాయి. కానీ ఆ అభిప్రాయం సరికాదు. అయితే.. సరైన నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే మాత్రం నష్టాల బారిన పడటం ఖాయం.
Indane Gas Customers: ఇండేన్ గ్యాస్ బుకింగ్, డెలివరీ సేవల్లో రెండు రోజులుగా అంతరాయం ఏర్పడినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని, బహుశా ఈ రోజు సాయంత్రానికి ఇబ్బందులు తొలిగిపోతాయని, దీంతో రేపటి నుంచి యథావిధిగా సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు నిన్న మంగళవారం పేర్కొంది. అయితే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మాత్రం చెప్పలేదు.
‘Fine’ Apple: ఛార్జర్ లేకుండా ఐఫోన్ అమ్మొద్దని బ్రెజిల్ ప్రభుత్వం యాపిల్ సంస్థను ఆదేశించింది. ఈ మేరకు అఫిషియల్ గెజిట్‌లో పేర్కొంది. ఫోన్‌కి ఛార్జర్ అవసరమని తెలిసినప్పటికీ ఆ సంస్థ ఉద్దేశపూర్వకంగానే వినియోగదారులపై వివక్ష చూపినట్లు తప్పుపట్టింది. ఈ తప్పు చేసినందుకు 2 పాయింట్ మూడు ఎనిమిది మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించింది. ఇక మీదట ఛార్జర్ లేకుండా ఏ ఐఫోన్ మోడల్‌నీ విక్రయించొద్దని తేల్చిచెప్పింది.
Special Story on Laxman Narasimhan: స్టార్‌బక్స్ అనేది ప్రపంచంలోని కాఫీ హౌస్ చెయిన్‌లో అతిపెద్ద సంస్థ. ఇదొక అమెరికన్ కంపెనీ. దీని హెడ్డాఫీసు వాషింగ్టన్లో ఉంది. ఇన్నాళ్లూ నంబర్ వన్‌గా ఉన్న ఈ సంస్థ ఈ మధ్య కాలంలో కొన్ని ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని స్టోర్లను మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంస్థకు అతిపెద్ద ఓవర్సీస్ మార్కెట్ అయిన చైనాలో కొవిడ్ ఆంక్షల కారణంగా కాఫీ బిజినెస్ తగ్గుముఖం పట్టింది.
World's Top 5 Pharma Companies: మన దేశానికి ఫార్మా రాజధాని హైదరాబాద్ అని చెబుతుంటారు. అందువల్ల తెలుగు ప్రజలకు ఈ ఇండస్ట్రీ మీద కొంచెం ఎక్కువే అవగాహన ఉంటుంది. ఇండియాలోని టాప్ 5 ఫార్మా కంపెనీల పేర్లు ఈజీగానే చెప్పగలుగుతారు. అయితే ప్రపంచంలోని టాప్ 5 ఫార్మా కంపెనీలు ఏవి అని అడిగితే మాత్రం అందరూ సమాధానం చెప్పలేకపోవచ్చు. ఈ ఫీల్డ్‌లో పనిచేసేవాళ్లతోపాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఈ సమాచారం
Record Level Car Pre-Bookings: ప్రస్తుతం కొత్త కారును సొంతం చేసుకోవాలంటే డబ్బులుంటే చాలదు. దానికి మించి ఓపిక కావాలి. క్యూలోని లక్షల మందిలో ఒకరిగా వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. కనీసం రెండు, మూడు నెలల నుంచి గరిష్టంగా ఐదారు నెలల దాక ఎదురుచూడక తప్పదు. కొత్త కార్ల కోసం గతంలో ఎన్నడూలేనంతగా ప్రీ-బుకింగ్స్ పెండింగ్‌లో ఉండటమే దీనికి ప్రధాన కారణమని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Demand For Heavy Vehicles: మధ్య తరహా, భారీ వాణిజ్య వాహనాల కొనుగోళ్లు ఈ ఏడాది 50 శాతం పెరిగే ఛాన్స్ ఉందని డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికిల్స్ ఎండీ అండ్ సీఈఓ సత్యకం ఆర్య అన్నారు. ఈ వాహనాలకు గత కొద్ది నెలలుగా డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. జనవరి, ఆగస్టు మధ్య కాలంలో ట్రక్కులు, బస్సుల అమ్మకాల్లో వృద్ధి నెలకొందని పేర్కొన్నారు. అయితే 2018లో మాదిరిగా పీక్ లెవల్లో మాత్రం సేల్స్ జరగట్లేదని తెలిపారు.
Indian Youth Opting Gig jobs: మన దేశంలో యువత గతంలో ఎన్నడూ లేనంతగా గిగ్ జాబ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో గతేడాది కన్నా 50 శాతం ఎక్కువ మంది ఈ కొలువుల్లో చేరారు. ముఖ్యంగా జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల 3 నుంచి 5 ఏళ్ల అనుభవం కలిగినవారు వీటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు ఫ్లెక్సింగిట్ అనే ఫ్రీల్యాన్స్ జాబ్స్ ప్లాట్‌ఫాం వెల్లడించింది. టెక్నాలజీ స్కిల్స్‌కి డిమాండ్ నెలకొనటం వల్ల కూడా గిగ్ జాబ్స్ రిక్రూట్మెంట్లు…