Top Five Insurance Companies in India: జీవితానికే కాదు. వాహనాలకు, సంస్థలకు, వ్యాపారాలకు, ఆరోగ్యానికి, పంటలకు ఇలా.. ప్రతి కేటగిరీలోనూ ఇన్సూరెన్స్ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే మన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చాలా బీమా సంస్థలు ఉన్నాయి. అయితే జనం ఎక్కువ శాతం ప్రభుత్వ బీమా సంస్థల వైపే మొగ్గుచూపుతుండటం చెప్పుకోదగ్గ విషయం. ఇండియాలోని టాప్ ఫైవ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో మూడు సంస్థలు సర్కారుకు సంబంధించినవే కావటం దీనికి నిదర్శనం. వీటిలో మొదటిది.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ). రెండోది.. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. మూడోది.. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన, ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలనుకునేవారు ఎన్-బిజినెస్ అందిస్తున్న ఈ స్పెషల్ వీడియోని చూడొచ్చు.