Today (30-01-23) Stock Market Roundup: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల్లో భయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో వాటాల అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఫలితంగా ఈ వారం ప్రారంభం రోజైన ఇవాళ సోమవారం రెండు కీలక సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. బెంచ్ మార్క్‌ను దాటి పైకి రాలేకపోయాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ వెంటనే లాభాల్లోకి వచ్చాయి.
Today (30-01-23) Business Headlines: ఏపీలో ఒబెరాయ్ హోటల్స్: ఆంధ్రప్రదేశ్‘లోని వివిధ జిల్లాల్లో ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ నిర్మాణం జరగనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ APTDCతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా మొదట తిరుపతిలోని అలిపిరిలో 100 కోట్ల రూపాయల ఖర్చుతో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టనుంది. దీనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల భూమిని లీజ్ కమ్ రెంట్ ప్రాతిపదికన కేటాయించింది.
Budget and Startups: 2022వ సంవత్సరంలో ఇండియన్ స్టార్టప్‌ల వ్యవస్థ కొంచెం గాడి తప్పింది. నిధులు నిండుకోవటంతో తిరోగమనంలో పయనించింది. ఈ ఫండింగ్ సమస్య వల్ల స్టార్టప్‌లకు ఆశాజనకమైన పరిస్థితులు కరువయ్యాయి. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు డబ్బు ఇచ్చేందుకు ముందుకురాలేని ప్రతికూల పరిణామాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మరో 10 రోజుల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్-2023.. ఇండియన్ స్టార్టప్‌లకు ఎలాంటి భరోసా ఇస్తుందోనని సంబంధిత వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
Today (28-01-23) Business Headlines: పెరిగిన జియో, ఎయిర్’టెల్ కస్టమర్లు: గతేడాది నవంబర్’లో రిలయెన్స్ జియో మరియు ఎయిర్’టెల్’కి పాతిక లక్షల మంది వినియోగదారులు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకి మాత్రం 18 లక్షల మందికి పైగా తగ్గారు. ఈ విషయాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రిలయెన్స్ జియో 14 లక్షల 26 వేల మందిని, ఎయిర్’టెల్ 10 లక్షల 56 వేల మందిని కొత్తగా చేర్చుకున్నాయి.
Flight Journeys: మన దేశంలో విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. 2021వ సంవత్సరంతో పోల్చితే 2022లో 47 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. దేశీయ విమాన ప్రయాణాల వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. DGCA.. లేటెస్ట్గా వెల్లడించింది. 2022లో 12 కోట్ల 32 లక్షల 45 వేల మంది ఫ్లైట్లలో జర్నీ చేయగా 2021లో 8 కోట్ల 38 లక్షల 14 మంది మాత్రమే ప్రయాణించారు. 2022 నవంబర్ కన్నా డిసెంబర్లో 13 పాయింట్ ఆరు తొమ్మిది శాతం అధిక విమాన ప్రయాణాలు…
Today (27-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతం రోజు భారీ నష్టాల్లో ముగిసింది. అమ్మకాల ఒత్తిళ్లు తీవ్రంగా పెరగటంతో మూడు నెలల కనిష్టానికి పతనమైంది. అదానీ గ్రూప్‌పై హిండర్‌బర్గ్ నుంచి వచ్చిన ఆరోపణలు మొత్తం మార్కెట్ సెంటిమెంట్‌నే దెబ్బతీశాయి. దీంతో రెండు కీలక సూచీలు బెంచ్ మార్క్‌లను కూడా దాటలేని స్థితిలో డౌన్లో క్లోజ్ అయ్యాయి. ఇవాళ శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు.. అంటే.. సెకండ్ సెషన్లో నేల చూపులు చూసింది.
Today (27-01-23) Business Headlines: సీఈఓగా తప్పుకోనున్న టయోడా: జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు అధ్యక్షుడు అకియో టయోడా ఈ పదవుల నుంచి తప్పుకోనున్నారు. ఇక మీదట ఆయన సంస్థ చైర్మన్’గా మాత్రమే కొనసాగనున్నారు. అకియో టయోడా స్థానంలో కోజి సాటో CEOగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన ప్రస్తుతం టయోటా కంపెనీ చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్’గా చేస్తున్నారు.
Global Economic Downturn: అనుకున్నట్లే అయింది. మాంద్యం మొదలైంది. అంతర్జాతీయ ఆర్థిక తిరోగమనం తన ప్రభావం చూపుతోంది. ఆ సూచనలు భారతదేశ వాణిజ్య రంగంపై అప్పుడే స్పష్టంగా తెలిసిపోతున్నాయి. 2022 డిసెంబర్ నెలలో ఇండియా సరుకుల ఎగుమతులు 12 శాతానికి పైగా పడిపోయాయి. ఫలితంగా ఈ లావాదేవీల విలువ 34 పాయింట్ 5 బిలియన్ డాలర్లకే పరిమితం కావాల్సి వచ్చింది.
Rozgar Mela: క్రికెట్లో.. ‘‘అంపైర్ ఈజ్ ఆల్వేస్ రైట్’’ అంటుంటారు. అదే.. బిజినెస్ విషయానికొస్తే.. ‘‘కన్జ్యూమర్ ఈజ్ ఆల్వేస్ రైట్’’ అని చెబుతుంటారు. ఇప్పుడు.. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ‘‘సిటిజెన్ ఈజ్ ఆల్వేస్ రైట్’’ అని సరికొత్త పిలుపునిచ్చారు. అందుకే తమ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా సర్కారీ కొలువును ఒక ఉద్యోగంలాగా పేర్కొనదని, ప్రభుత్వ సేవగా, ప్రజా సేవగా పరిగణిస్తుందని మోడీ అన్నారు.
Backward China: కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకవని ఒక సామెత ఉంది. అదిప్పుడు చైనాకి సరిగ్గా సరిపోతుంది. ఆ దేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినా ఏం లాభం? అంత గొప్ప పేరు కూడా కరోనా ముందు లోకువ అయిపోయింది. జీరో కొవిడ్ పాలసీ కారణంగా చైనా ఎకానమీ 50 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎదురుతన్నటం కూడా దీనికి మరో ప్రధాన కారణంగా నిలిచింది.