Today (20-01-23) Stock Market Roundup: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడటంతో ఆ ప్రభావం మన దేశ స్టాక్ మార్కెట్‌పైన కూడా పడింది. దీంతో ఈ వారాంతం రెండు సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ శుక్రవారం ఉదయం అతి స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ సాయంత్రం కూడా నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి. రోజంతా అస్థిరంగానే కదలాడాయి. నిలకడలేక.. నష్టాల నడక సాగించాయి.
DRI notice to Samsung: పన్ను ఎగవేత ఆరోపణల కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్.. DRI.. శామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 1728 కోట్ల రూపాయలకు పైగా డబ్బును వడ్డీతో సహా పన్ను రూపంలో మీ నుంచి ఎందుకు వసూలు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పన్ను కట్టకుండా తప్పించుకున్నందుకు కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్కి పెనాల్టీ ఎందుకు విధించకూడదో కూడా చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.
Today (20-01-23) Business Headlines: మైక్రోసాఫ్ట్ @ తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో మరో 3 డేటా కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు 16 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఆసియా ప్రెసిడెంట్ అహ్మద్ మజహరి వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు జరుగుతున్న సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ని కలిసి తమ నిర్ణయాన్ని తెలిపారు.
Startups Funding Down: 2022లో మన దేశంలో స్టార్టప్‌లకు ఆశించిన స్థాయిలో డబ్బు పుట్టలేదు. 2021వ సంవత్సరంతో పోల్చితే 33 శాతం ఫండింగ్ పడిపోయింది. దీంతో.. గతేడాది సమీకరించిన మొత్తం నిధుల విలువ 24 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. 2021లో అయితే 35 బిలియన్ డాలర్లకు పైగా ఫండ్స్ జమకావటం విశేషం. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల్లో కూడా గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ పట్ల పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ క్రితం సంవత్సరం ఇలాంటి క్లిష్ట పరిస్థితి నెలకొనటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Today (19-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో వరుసగా రెండు రోజులు వచ్చిన లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు కూడా సాయంత్రం నష్టాలతోనే ముగిశాయి. మార్నింగ్ సెషన్లో వచ్చి భారీ నష్టాలను మాత్రం ఇంట్రాడేలో కొంత వరకు పూడ్చుకోగలిగాయి. కానీ.. అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల్లో నెలకొన్న ముందుజాగ్రత్తల ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ప్రతికూలంగా పడింది.
Today (19-01-23) Business Headlines: హైదరాబాద్ స్టార్టప్.. అరుదైన గుర్తింపు: హైదరాబాదులోని ఫిన్-టెక్ స్టార్టప్ సంస్థ MicroNsure Consultancyకి నేషనల్ అవార్డు లభించింది. 2022 సంవత్సరానికి గాను బీమా విభాగంలో ఈ పురస్కారం దక్కింది. ఈ విషయాన్ని కంపెనీ ఫౌండర్ అండ్ CEO కమలాకర్ సాయి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ MicroNsure Consultancy ఏర్పాటు లక్ష్యాలను వివరించారు.
Gold Imports: బంగారాన్ని తెగ ముద్దు చేసే మన దేశం ఇప్పుడు ‘వద్దు’ అంటోంది. ఫలితంగా పుత్తడి దిగుమతులు మూడో వంతుకు పైగా పడిపోయాయి. డిసెంబరులో ఏకంగా 79 శాతం ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి. ఈ విలువైన లోహాన్ని అధికంగా వినియోగించే దేశాల్లో 2వ స్థానంలో ఉన్న ఇండియా ఇలా ఒక్కసారిగా దిగుమతుల్లో భారీ కోత పెట్టడం గ్లోబల్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. భారతదేశం బంగారం ఇంపోర్టులను తగ్గించటం వల్ల ప్రపంచవ్యాప్తంగా లాభాల దూకుడు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
UPI Payment Fecility: ఇతర దేశాల్లో ఉండే ఇండియన్లు భారతదేశానికి డబ్బు పంపటం ఇక ఈజీ అయింది. మన దేశంలో అద్భుతమైన ప్రజాదరణ పొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్.. UPI అనే ఆన్లైన్ చెల్లింపుల విధానం ఇప్పుడు 10 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. UPIని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. NPCI ఈ మేరకు ప్రకటన చేసింది. ఎంపిక చేసిన 10 దేశాల్లో ఉపయోగించే ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్లతో లింక్ చేసిన అకౌంట్ల నుంచి కూడా మన దేశానికి డబ్బు పంపొచ్చని…
Work From Home: ఐటీ రంగంలో అగ్రగామి సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు ఇన్ఫోసిస్ కొత్త సంవత్సరంలో తమ ఉద్యోగులకు సరికొత్త ఆఫర్ ప్రకటించాయి. అయితే.. ఆ ఆఫర్.. ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఆమోదయోగ్యం అనిపిస్తుండగా టీసీఎస్ ఉద్యోగులకు మాత్రం హార్డ్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు వర్క్ ఫ్రం ఆఫీస్ చేయాల్సిందేనని టీసీఎస్ కంపెనీ తేల్చిచెబుతుండగా.. వర్క్ ఫ్రం హోం అయినా పర్లేదంటూ ఇన్ఫోసిస్ అనుమతిస్తోంది.
Today (18-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో వరుసగా రెండో రోజు కూడా జోష్ కనిపించింది. ఇవాళ బుధవారం ఉదయం రెండు కీలక సూచీలు ఊగిసలాట ధోరణిలో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం వరకు భారీగా లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ ఏకంగా 61 వేల పాయింట్లు అధిగమించింది. నిఫ్టీ 18 వేల పాయింట్లకు పైనే ట్రేడ్ అయింది. ఎంపిక చేసిన ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా బెంచ్‌మార్క్ సూచీలకు లాభాలు కొంత వరకు తగ్గినా గానీ అంతర్జాతీయ సానుకూల సంకేతాలు అండగా…