UP: ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను మహిళ కానిస్టేబుల్ ప్రేమ కాటేసింది. దీంతో ఆ ఇన్‌స్పెక్టర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ప్రస్తుతం ఈ కేసు సంబంధించిన సంచలన నిజాలు వెలుగు చూశాయి. ఇంతకీ ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జాలౌన్‌లో చోటుచేసుకుంది. జూలౌన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి తన సర్వీస్ రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఒక మహిళా కానిస్టేబుల్, ఒక పోలీసు అధికారి గదిలో ఉన్నారు. ఈ సంఘటన తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను ఉపయోగించి మహిళా కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ మరణానికి ప్రేమ వ్యవహారంలో బ్లాక్‌మెయిల్ చేయడం కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.
READ ALSO: T20 World Cup 2026: ఐసీసీకి గట్టి జలక్ ఇచ్చిన జియోహాట్‌స్టార్.. దెబ్బ మామూలుగా లేదు కదా!
అసలు ఏం జరిగిందంటే గత శుక్రవారం జలౌన్‌లోని కుతౌంధ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ అరుణ్ కుమార్ రాయ్ ఇంట్లో గందరగోళం చోటుచేసుకుంది. జలౌన్‌లోని కోచ్ పోలీస్ స్టేషన్‌లో 112 పీఆర్‌వీలో మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మీనాక్షి శర్మ ఇన్‌స్పెక్టర్ గది నుంచి బయటకు పరిగెత్తుకొని వస్తూ.. ఇన్‌స్పెక్టర్ తనను తాను కాల్చుకొని చనిపోయాడని చెప్పారు. ఆ తర్వాతి అరుణ్ కుమార్ కుటుంబం గోరఖ్‌పూర్ నుంచి జలౌన్‌కు వచ్చినప్పుడు, ఇన్‌స్పె్క్టర్ భార్య.. మీనాక్షి శర్మపై హత్య నేరం కింద కేసు నమోదు చేసింది. దీంతో అధికారులు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆ పోలీసులు మహిళా కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.
తాజాగా ఇన్‌స్పెక్టర్ అరుణ్ – కానిస్టేబుల్ మీనాక్షి వెనుక ఉన్న షాకింగ్ కథ బయటికి వచ్చింది. ఇన్‌స్పెక్టర్ అరుణ్ మీరట్ నివాసి అయిన మహిళా కానిస్టేబుల్ మీనాక్షి మధ్య సాన్నిహిత్యం ఉందని సమాచారం. కోచ్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. అరుణ్ కుమార్ రాయ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న కాలంలో మీనాక్షి ఎప్పుడూ యూనిఫాం ధరించలేదని, అలాగే పోలీస్ స్టేషన్‌లో కూడా తన విధులను అరుదుగా నిర్వహించేదని, ఆ సమయంలో చాలా అహంకారంతో తిరిగేదని వెల్లడించారు. ఎందుకంటే ఆమె అరుణ్ కుమార్ రాయ్‌కు ఇష్టమైన వ్యక్తి అని స్టేషన్‌లో అందరికీ తెలుసని అన్నారు. అరుణ్ కుతాండ్ ఇన్‌స్పెక్టర్ అయినప్పుడు మీనాక్షిని కోచ్ పోలీస్ స్టేషన్‌లోని 112 పీఆర్‌వీకి పోస్ట్ చేశారని పేర్కొన్నారు. అయితే మీనాక్షి శర్మ పెళ్లి చేసుకోబోతున్నారని, తన పెళ్లి కోసం అరుణ్ కుమార్ రాయ్ నుంచి ఆమె రూ.25 లక్షలు డిమాండ్ చేస్తోందని సమాచారం. అరుణ్‌పై ఈ ఒత్తిడి క్రమంగా పెరిగిందని, చివరికి ఆయన విసుగు చెందిన తన ప్రాణాలను తీసుకున్నాడని చెబుతున్నారు. మరోవైపు మీనాక్షి శర్మ గతంలో పని చేసిన పురాన్ పూర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె తోటి కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసు పెట్టింది. ఈ కేసులో కూడా ఆమె ఆ కానిస్టేబుల్ నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2022లో మీనాక్షి ఫిర్యాదుతో పిలిభిత్ పోలీస్ స్టేషన్‌లో మోహిత్ అనే కానిస్టేబుల్‌పై అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.