‘‘STUMAGZ’’ FOUNDER & CEO CHARAN LAKKARAJU EXCLUSIVE INTERVIEW: స్టుమాగ్ సంస్థ.. డిజిటల్ ఎడ్యుకేషన్ స్పేస్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ చరణ్ లక్కరాజును విద్యార్థులు కమ్యూనిటీ ఛాంపియన్‌గా పిలుస్తుంటారు. ఈ సంస్థ.. టియర్-2, టియర్-3 కాలేజీల విద్యార్థుల కోసం అత్యుత్తమ వేదికను ఏర్పాటుచేసింది. దాన్ని.. గ్లోబల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌గా అభివృద్ధి చేసింది.
Today (01-02-23) Stock Market Roundup: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై రెండు విధాలుగా వ్యక్తమైంది. సెన్సెక్స్ లాభపడగా.. నిఫ్టీ స్వల్పంగా నష్టపోయింది. రెండు కీలక సూచీలు ఇవాళ బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభం కాగా ఇంట్రాడేలో పెద్దఎత్తున అప్ అండ్ డౌన్స్‌కి గురయ్యాయి. ఫలితంగా.. వరుసగా మూడో రోజు.. సెన్సెక్స్, నిఫ్టీ.. బెంచ్ మార్క్‌లకు దిగువనే ముగిశాయి.
Economic Survey 2023 Highlights: ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వే-2023ను ప్రవేశపెట్టారు. ఈ సర్వే మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులకు అద్దం పట్టింది. వివిధ రంగాల గణాంకాలను సవివరంగా పొందుపరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయా సెక్టార్ల పనితీరును ప్రతిబింబించింది. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన వివిధ పథకాల గురించి, వాటి వల్ల వచ్చిన ఫలితాల గురించి స్పష్టంగా పేర్కొంది.
Today (01-02-23) Business Headlines: ఇండియాలో యాపిల్ విస్తరణ: యాపిల్ కంపెనీ ఎయిర్‌పాడ్స్ విడి భాగాల తయారీ ఇండియాలో ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీన్నిబట్టి ఈ అమెరికా టెక్నాలజీ జెయింట్.. భారత్దేశంలో ప్రొడక్షన్‌ను విస్తరిస్తోందని చెప్పొచ్చు. యాపిల్ కంపెనీకి కీలకమైన సప్లయర్‌గా వ్యవహరిస్తున్న జాబిల్ అనే సంస్థ ఎయిర్‌పాడ్స్ ఎన్క్లోజర్లను లేదా ప్లాస్టిక్ పరికరాలను చైనాకి మరియు వియత్నాంకి సరఫరా చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
I Love You Pepsi: సూపర్ డూపర్ హిట్ సినిమా కేజీఎఫ్‌తో దేశం నలుమూలలా అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించుకున్న కన్నడ స్టార్.. యువ హీరో.. యశ్.. కొత్త సంవత్సరంలో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేశాడు. ప్రాజెక్ట్ అంటే సినిమా కాదు. పెప్సీ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేయటం పట్ల యశ్ సంతోషం వ్యక్తం చేశాడు. లైఫ్‌లో ప్రతి మూమెంట్‌నీ ఎంజాయ్ చేయాలని, తద్వారా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలనేది తన విధానమని పేర్కొన్నాడు.
Today (31-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో ఇవాళ ట్రేడింగ్ మొత్తం అస్థిరంగానే సాగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 7 శాతంతో పోల్చితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతంగానే ఉంటుందని ఎకనమిక్ సర్వే-2023 పేర్కొనటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో 2 కీలక సూచీలు వరుసగా 2వ రోజు అంటే ఇవాళ కూడా బెంచ్ మార్క్‌లకు దిగువనే ముగిశాయి.
Today (31-01-23) Business Headlines: హైదరాబాదులో అమెరికా సంస్థ: అమెరికా సంస్థ క్యూబిక్ ట్రాన్సుపోర్టేషన్ సిస్టమ్స్ మన దేశంలో కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాదులో ఆఫీసును ప్రారంభించింది. రానున్న రోజుల్లో 150 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. బస్సులు, ట్రైన్లు, మెట్రో రైళ్లు, పార్కింగ్, ఫైర్ కలెక్షన్ తదితర సర్వీసులకు ఒకే కార్డుతో పేమెంట్ చేసే వన్ అకౌంట్ టికెటింగ్ సేవలను అందించనుంది.
Smart Phones: ఇండియన్స్ సహజంగా రెండేళ్లకోసారి స్మార్ట్‌ఫోన్ మారుస్తుంటారు. కిందపడి పగిలిపోవటం వల్ల గానీ.. పాతబడి సరిగా పనిచేయకపోవటం వల్ల గానీ.. వాడుతున్న ఫోన్‌ను పక్కన పెట్టి కొత్తది కొంటుంటారు. కానీ.. ఇప్పుడు.. అలా.. ఈజీగా కొత్త ఫోన్ కొందామంటే ప్రజల దగ్గర పైసల్లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా.. ద్రవ్యోల్బణం వల్ల ఇండియాలో తక్కువ రేటు స్మార్ట్ఫోన్లకి డిమాండ్ పడిపోయింది.
India Shining: భారత్ వెలిగిపోతోంది.. ఇండియా షైనింగ్.. ఇది 20 ఏళ్ల కిందటి ఎన్నికల స్లోగన్. అప్పుడు వర్కౌట్ కాలేదు గానీ ఇప్పుడు మన దేశం నిజంగానే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశంలో వెలిగిపోయింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ విశిష్టతను ప్రపంచ దేశాలు గుర్తించి ప్రశంసించాయి. ఇండియాలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న నేపథ్యంలో కూడా ఇండియా పట్ల ఇంతటి స్థాయిలో ప్రగాఢ విశ్వాసం వ్యక్తం కావటం విశేషం.
T+1 Settlement Cycle: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. T+1 సెటిల్మెంట్ సైకిల్ అందుబాటులోకి వచ్చింది. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో ట్రేడింగ్ చేసిన సెక్యూరిటీస్ ఒక్క రోజు వ్యవధిలోనే మన డీమ్యాట్ అకౌంట్లలో జమవుతాయి. స్టాక్స్ విక్రయించగా వచ్చే డబ్బు లేదా ప్రాఫిట్స్ కూడా ఒక్క వర్కింగ్ డేలోనే మన చేతికొస్తాయి. దీనికి గతంలో 2 రోజులు పట్టేది. మధ్యలో సెలవులొస్తే మరింత ఆలస్యమయ్యేది. కొత్త విధానం ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.