Cinema Theatres: సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లే వాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ మేరకు గత ఏడాది కాలంలో 150 శాతం వృద్ధి నెలకొందని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది. వచ్చే 2 నెలల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు మూవీ కోసం సినిమా హాల్‌కు లేదా మల్టీప్లెక్స్‌కు వెళ్లటానికి ప్లాన్ చేస్తున్నారు. గడచిన 2 నెలల్లో.. అంటే.. 2022 నవంబర్, డిసెంబర్లలో.. 26 శాతం మంది సినిమా హాల్‌కి లేదా మల్టీప్లెక్స్‌కి వెళ్లినట్లు తెలిపారు.
Pragati CEO Paruchuri Narendra Exclusive interview: ప్రపంచంలోని కీలకమైన పరిశ్రమల్లో ప్రింటింగ్ ఇండస్ట్రీ ఒకటి. ఆదాయంపరంగా టాప్-5లో కొనసాగుతోంది. ఇందులో ఇండియా కూడా విశేషంగా రాణిస్తోంది. మన దేశంలో మొత్తం రెండున్నర లక్షల ప్రింటింగ్ కంపెనీలున్నాయి. వాటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రగతి ఆఫ్సెట్ ప్రైవేట్ లిమిటెడ్ తనదైన చెరిగిపోని ముద్ర వేసింది. అత్యత్తమ నాణ్యతకు మారుపేరుగా నిలుస్తూ 60 ఏళ్లుగా తిరుగులేని సేవలందిస్తోంది.
Business Headlines 04-02-23: తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్ల అప్డేషన్: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్లని ఆధునికీకరించే ప్రణాళికలను ఇండియా సిమెంట్స్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు 16 వందల కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు పేర్కొంది. ఇండియా సిమెంట్స్‌కి తెలంగాణలోని మల్కాపూర్ మరియు విష్ణుపురంలలో పాత ప్లాంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిలంకూర్, ఎర్రగుంట్లలో కూడా ఉన్నాయి. ఈ ప్లాంట్లను ఆధునికీకరించే ప్రక్రియ ఏడాదిన్నర వరకు పట్టొచ్చని ఇండియా సిమెంట్స్ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీనివాసన్ తెలిపారు.
Today (03-02-03) Stock Market Roundup: వారాంతం రోజైన ఇవాళ శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లో జోష్ కనిపించింది. రెండు కీలక సూచీలు కూడా లాభాలతో ప్రారంభమై లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్.. బెంచ్‌మార్క్ అయిన 60 వేల పాయింట్లను అధిగమించింది. ఫైనాన్షియల్ మరియు ఐటీ షేర్లు భారీగా లాభాలను ఆర్జించాయి. దీంతో ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో ఈ వారం మొత్తం నెలకొన్న ప్రతికూల వాతావరణం ఇవాళ ఒక్కరోజుతో కొట్టుకుపోయింది.
Airtel: ఎయిర్టెల్ మినిమం రీఛార్జ్ 99 రూపాయల నుంచి 155 రూపాయలకు పెరిగింది. ఇలా ఒక్కసారే 56 రూపాయలు పెంచటం ఇదే ఫస్ట్ టైమ్. పైగా.. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఖరీదు ఎక్కువ.. వ్యాలిడిటీ తక్కువ కావటం గమనించాల్సిన విషయం. 155 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 24 రోజుల వరకు మాత్రమే వస్తుంది. నెల తిరిగే లోపు మళ్లీ 155 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Blockbuster Vs Netflix: ఒక్కోసారి పక్కోడి శాపాలు మనకు వరాలుగా మారుతుంటాయి. అప్పటివరకు మనం ఏ నంబర్ వన్ స్థానం కోసమైతే పోరాడుతుంటామో అది మనకు సునాయాసంగా దక్కుతుంది. అయితే.. మనం ఆ పక్కోడితో నువ్వా నేనా అనే రేంజ్లో పోరాటం చేస్తేనే ఈ సూత్రం వర్తిస్తుంది. దీన్నే.. ‘‘కాలం కలిసి రావటం’’ అని కూడా అంటారు. వీడియో స్ట్రీమింగ్ రంగంలో మనందరం ఇప్పుడు చెప్పుకుంటున్న నెట్‌ఫ్లిక్స్‌కి ఇది బాగా సూటవుతుంది. ఇది పూర్తిగా అర్థంకావాలంటే ఇన్నాళ్లూ మనకు తెలియని బ్లాక్‌బస్టర్ స్టోరీ గురించి…
Today (03-02-23) Business Headlines: హైదరాబాద్ కంపెనీ ‘ఆజాద్’ ఘనత: హైదరాబాద్ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ మార్కెట్’కి న్యూక్లియర్ విడి భాగాలను అందించిన దేశంలోనే తొలి కంపెనీగా నిలిచింది. ఫ్రాన్స్’లో తయారుచేస్తున్న న్యూక్లియర్ టర్బైన్లకు కీలకమైన స్పేర్ పార్ట్స్ సప్లై చేసినట్లు ఆజాద్ ఇంజనీరింగ్ సంస్థ వెల్లడించింది. ఫ్రాన్స్ కంపెనీ GE స్టీమ్ పవర్’తో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందం వల్లే వరల్డ్ వైడ్’గా న్యూక్లియర్ సెక్టార్’లో బిజినెస్ ఆపర్చునిటీస్’ని దక్కించుకున్నామని తెలిపింది.
Today (02-02-23) Stock Market Roudup: దేశీయ స్టాక్ మార్కెట్లో ఏమాత్రం మార్పు రాలేదు. నిన్నటిలాగే మిశ్రమ ఫలితాలు నెలకొన్నాయి. ఇవాళ గురువారం కూడా సెన్సెక్స్ లాభపడగా నిఫ్టీ నష్టపోయింది. వరుసగా నాలుగో రోజు సైతం రెండు కీలక సూచీలు బెంచ్ మార్క్ దాటకుండానే దిగువనే ముగిశాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విషయంలో పాజిటివ్ టాక్ వస్తున్నప్పటికీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో పరిస్థితులు మెరుగుపడకపోవటం గమనించాల్సిన విషయం.
India's Services Exports: మన దేశంలో సేవల రంగం పనితీరు అద్భుతంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సేవల రంగం ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని దాటేస్తాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పటికీ ఇండియా సర్వీస్ ఎక్స్‌పోర్ట్‌లు 300 బిలియన్ డాలర్ల టార్గెట్‌ను క్రాస్ చేయనున్నాయని తెలిపింది. ఈ మేరకు 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు 20 శాతం గ్రోత్ నమోదు చేస్తామని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమ శాఖల మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు.
Today (02-02-23) Business Headlines: అనలిస్టులను ఆశ్చర్యపరచిన ‘మెటా’: మెటా సంస్థ అంచనాలకు మించి మంచి త్రైమాసిక ఫలితాలను నమోదు చేయటం ద్వారా మార్కెట్ అనలిస్టులను ఆశ్చర్యపరచింది. 40 బిలియన్ డాలర్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32 పాయింట్ 7 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించినట్లు వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఆదాయం నాలుగు శాతం తగ్గినట్లు తెలిపింది.