Today (01-02-23) Stock Market Roundup: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై రెండు విధాలుగా వ్యక్తమైంది. సెన్సెక్స్ లాభపడగా.. నిఫ్టీ స్వల్పంగా నష్టపోయింది. రెండు కీలక సూచీలు ఇవాళ బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభం కాగా ఇంట్రాడేలో పెద్దఎత్తున అప్ అండ్ డౌన్స్‌కి గురయ్యాయి.
ఫలితంగా.. వరుసగా మూడో రోజు.. సెన్సెక్స్, నిఫ్టీ.. బెంచ్ మార్క్‌లకు దిగువనే ముగిశాయి. బడ్జెట్ ఆశాజనకంగా ఉందంటూ సానుకూల అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు ఆశ్చర్యకరంగా ఇంత స్వల్ప మార్జిన్లతో ఎండ్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 158 పాయింట్లు పెరిగి 59 వేల 708 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
Economic Survey 2023 Highlights: ‘ఎకనమిక్ సర్వే-2023’ చెబుతున్నదిదే
నిఫ్టీ 45 పాయింట్లు తగ్గి 17 వేల 616 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం వరకు నష్టపోయాయి. సెక్టార్ల వారీగా చూస్తే.. నిఫ్టీలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల సూచీ 9 శాతం పతనమైంది. మెటల్ ఇండెక్స్ 5 పాయింట్ 6 శాతం దిగజారింది.
నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్, రియాల్టీ సూచీలు రెండు శాతానికి పైగా పడిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర 448 రూపాయలు పెరిగి గరిష్టంగా 57 వేల 690 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి 986 రూపాయలు లాభపడి అత్యధికంగా 69 వేల 815 రూపాయలు పలికింది.
క్రూడాయిల్ రేటు అత్యంత స్వల్పంగా 13 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు ధర 6 వేల 476 రూపాయలుగా నమోదైంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 81 రూపాయల 92 పైసల వద్ద స్థిరపడింది. రూపాయి విలువ పెరగటం గానీ తగ్గటం గానీ జరగలేదు.