I Love You Pepsi: సూపర్ డూపర్ హిట్ సినిమా కేజీఎఫ్‌తో దేశం నలుమూలలా అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించుకున్న కన్నడ స్టార్.. యువ హీరో.. యశ్.. కొత్త సంవత్సరంలో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేశాడు. ప్రాజెక్ట్ అంటే సినిమా కాదు. పెప్సీ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేయటం పట్ల యశ్ సంతోషం వ్యక్తం చేశాడు.
లైఫ్‌లో ప్రతి మూమెంట్‌నీ ఎంజాయ్ చేయాలని, తద్వారా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలనేది తన విధానమని పేర్కొన్నాడు. అభిరుచిని నిర్మొహమాటంగా అనుసరించాలనేది కూడా తన విధానంలో భాగమని, పెప్సీ పాలసీ సైతం ఇదేనని యశ్ తెలిపాడు. పెప్సీతో అనుబంధాన్ని ఏర్పరచుకోవటం ద్వారా నూతన సంవత్సరాన్ని గొప్పగా ప్రారంభించానని చెప్పాడు.
read more: Smart Phones: డిమాండ్ తగ్గిన ‘లో-వ్యాల్యూ’ స్మార్ట్ మొబైల్స్
అభిమానులు తన కొత్త మూవీ కోసం ఎదురుచూడాల్సిన పనిలేదని, ఇకపై నిత్యం వాళ్లకు పెప్సీ యాడ్స్ రూపంలో కనిపిస్తానని యశ్ అన్నాడు. ఇండియా కల్చర్‌లో ఎల్లవేళలా భాగమయ్యేందుకు పెప్సీ ఎప్పటికప్పుడు తననుతాను పునర్నిర్మించుకోవటం మరియు పునరావిష్కరణ చేసుకోవటం జరుగుతోంది. ఈ మేరకు ప్రస్తుతం యూత్‌లో భారీ స్థాయిలో ఫాలోయింగ్ కలిగిన కేజీఎఫ్ కథనాయకుడు యశ్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవటం ఆసక్తి కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో.. పెప్సీకి అమ్మకాల రూపంలో కేజీఎఫ్ మూవీ రేంజ్‌లో కలెక్షన్లు కురుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్‌తో కలిసి నడవటం థ్రిల్లింగ్‌గా ఉందని పెప్సీ కోలా కేటగిరీ లీడ్ సౌమ్యా రాథోడ్ హర్షం వెలిబుచ్చారు. పెప్సీ జర్నీ 2023లో టాప్ గేర్‌లో దూసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.