‘‘STUMAGZ’’ FOUNDER & CEO CHARAN LAKKARAJU EXCLUSIVE INTERVIEW: స్టుమాగ్ సంస్థ.. డిజిటల్ ఎడ్యుకేషన్ స్పేస్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ చరణ్ లక్కరాజును విద్యార్థులు కమ్యూనిటీ ఛాంపియన్‌గా పిలుస్తుంటారు. ఈ సంస్థ.. టియర్-2, టియర్-3 కాలేజీల విద్యార్థుల కోసం అత్యుత్తమ వేదికను ఏర్పాటుచేసింది. దాన్ని.. గ్లోబల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌గా అభివృద్ధి చేసింది.
విద్యార్థులకు.. నాలెడ్జ్, సరైన నెట్‌వర్క్ మరియు సరైన అవకాశం.. ఈ మూడు అంశాలు చాలా ముఖ్యమని అభిప్రాయపడుతోంది. స్టూడెంట్స్‌కి నెట్‌వర్త్ కన్నా నెట్‌వర్క్ చాలా ఇంపార్టెంట్ అని పేర్కొంటోంది. అలాంటి నెట్‌వర్క్‌ని తమ ప్లాట్‌ఫామ్ ద్వారా అందిస్తున్నామంటోంది. మన దేశంలోని మధ్య తరగతి విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టే ప్రపంచ స్థాయి వేదిక స్టుమాగ్ అని చెబుతున్న ఆ సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ చరణ్ లక్కరాజుతో ‘‘ఎన్-బిజినెస్ టెక్ టాక్’’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..