T+1 Settlement Cycle: ఒక్క రోజులోనే మన ఖాతాలోకి డబ్బులు లేదా సెక్యూరిటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T+1 Settlement Cycle: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. T+1 సెటిల్మెంట్ సైకిల్ అందుబాటులోకి వచ్చింది. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ట్రేడింగ్ చేసిన సెక్యూరిటీస్ ఒక్క రోజు వ్యవధిలోనే మన డీమ్యాట్ అకౌంట్లలో జమవుతాయి. స్టాక్స్ విక్రయించగా వచ్చే డబ్బు లేదా ప్రాఫిట్స్ కూడా ఒక్క వర్కింగ్ డేలోనే మన చేతికొస్తాయి. దీనికి గతంలో 2 రోజులు పట్టేది.
మధ్యలో సెలవులొస్తే మరింత ఆలస్యమయ్యేది. కొత్త విధానం ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఇన్వెస్టర్ల వద్ద ఎప్పుడూ డబ్బు మెదులుతుంది. ఫలితంగా BTST ప్రక్రియ.. అంటే.. బై టుడే సెల్ టుమాటో అనే ట్రేడింగ్ విధానం మరింత సులువవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో చైనా తర్వాత ఈ T+1 సెటిల్మెంట్ సైకిల్‌ని అమలుచేస్తున్న 2వ దేశం ఇండియానే కావటం విశేషం.
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
read more: Budget and Startups: కేంద్ర బడ్జెట్.. స్టార్టప్‌లకు ఏమిస్తుంది?
ఇండియన్ స్టాక్ మార్కెట్‌లోని స్టాక్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ వంటి లిస్టెడ్ సెక్యూరిటీలన్నీ ఇక ఈ వన్ డే ట్రేడ్ సెటిల్మెంట్ సైకిల్ పరిధిలోకి వస్తాయి. శుక్రవారం కొనుగోలు చేసిన స్టాక్స్ కొత్త విధానం ప్రకారం ఒక్క రోజులోనే.. అంటే.. శనివారమే మన అకౌంట్‌లోకి క్రెడిట్ కావాలి.
కానీ.. శనివారం, ఆదివారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావటంతో సోమవారం మన ఖాతాలోకి వస్తాయి. అప్పుడు వాటిని అమ్ముకోవటానికి వీలు కలుగుతుంది. వాస్తవానికి స్టాక్స్‌ను ఈ షార్ట్ ట్రేడ్ సైకిల్‌లోకి బదిలీ చేసే ప్రక్రియ 2022 ఫిబ్రవరిలోనే ప్రారంభమైంది. ప్రతి నెలా కొన్ని స్టాక్స్ చొప్పున యాడ్ చేస్తున్నారు. తక్కువ క్యాపిటలైజేషన్ విలువ కలిగిన స్టాక్స్‌ను ముందుగా మూవ్ చేశారు.
ప్రస్తుతం చివరి బ్యాచ్‌లోని 250కి పైగా స్టాక్స్‌ను కొత్త విధానంలోకి మార్చే ప్రక్రియ పూర్తికావొస్తోంది. T+1 సెటిల్మెంట్ సైకిల్ వల్ల మార్కెట్‌లో ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా, యూరప్, జపాన్, కెనడా వంటి దేశాలు ఇంకా T+2 సెటిల్మెంట్ సైకిల్‌నే ఫాలో అవుతున్నాయి. వాటి కన్నా వేగంగా మన దేశం T+1 సెటిల్మెంట్ సైకిల్‌ని అమల్లోకి తీసుకురావటం గొప్ప విషయమని అనలిస్టులు ప్రస్తావిస్తున్నారు.
ఇండియన్ క్యాపిటల్ మార్కెట్లలో చోటుచేసుకున్న ఈ చారిత్రక పరిణామం వల్ల BTST ట్రేడ్‌కు సంబంధించిన బ్యాడ్ డెలివరీ, ఆక్షన్స్ వంటి సమస్యలన్నీ చాలా వరకు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్‌లో సెటిల్‌మెంట్ వ్యవధి తక్కువగా ఉండటం వల్ల పెట్టుబడిదారులకు ఫండ్స్ శీఘ్రమే అందుతాయని, దీంతో ట్రేడింగ్ సాఫీగా జరుగుతుందని పరిశీలకులు పేర్కొన్నారు.
ఇండియన్ ఎకానమీ డిజిటల్ జర్నీ ఎంత వేగంగా జరుగుతోందో చెప్పేందుకు ఇదొక చక్కని ఉదాహరణ అని అన్నారు. ఈ దిశగా మనం ఎంతో అభివృద్ధి సాధించాం కాబట్టే ఈక్విటీ మార్కెట్ సెటిల్‌మెంట్లను 24 గంటల్లోనే పూర్తిచేసుకోగలుగుతున్నామని గుర్తుచేశారు. షేర్లు అమ్మిన ఒక్క రోజులోనే డబ్బు మన ఖాతాలో పడనుందని, దీనివల్ల స్టాక్స్ నిర్వహణ సామర్థ్యాలు పెరుగుతాయని చెప్పారు.
T+1 సెటిల్మెంట్ సైకిల్‌ని చైనా పాక్షికంగా అమలుచేస్తుండగా ఇండియా పూర్తి స్థాయిలో అమలుచేస్తూ గొప్ప ముందడుగు వేసిందని చెప్పటంలో ఎలాంటి సందేహంలేదని విశ్లేషకులు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకున్నా కూడా ఇండియా.. స్టాక్ మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సేఫ్టీ వంటి అంశాల్లో ఎంతో ముందుందని చెప్పటానికి సంతోషం కలుగుతోందని అనలిస్టులు అన్నారు.
స్టాక్స్ ఎక్స్ఛేంజ్‌ల్లో పెద్ద మొత్తంలో ట్రేడింగ్ ఎక్కువ శాతం ఇంట్రాడేలోనే జరుగుతుంది. కానీ.. ఆ ఇన్వెస్టర్లకు స్టాక్స్ డెలివరీ అనేది ఇన్‌స్టంట్‌గా జరగట్లేదు. డబ్బులకు సంబంధించిన ఆన్‌లైన్ పేమెంట్లు క్షణాల్లో జరుగుతుంటే స్టాక్స్‌కు సంబంధించిన సెటిల్‌మెంట్లు ఎందుకు తక్షణం పూర్తికావట్లేదు అనేది ఇన్నాళ్లూ ఆశ్చర్యకరంగా అనిపించేదని పరిశీలకులు పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి నిరీక్షణలకు అవకాశంలేదని తెలిపారు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!