India EV market: మరో ఏడేళ్లలో మన దేశంలో ఎక్కడ చూసినా విద్యుత్ వాహనాలే కనిపించనున్నాయి. ఎందుకంటే ఆ వాహనాల అమ్మకాలు 2030 నాటికి ఏటా కోటి యూనిట్లకు చేరుకోనున్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక సర్వే-2023 పేర్కొంది. భారతదేశం హరిత ఇంధనం దిశగా పయనించటంలో ఆటోమోటివ్ ఇండస్ట్రీ కీలక పాత్ర పోషించనుందని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. 2022 నుంచి 2030 వరకు దేశీయ విద్యుత్ వాహనాల మార్కెట్ ఏటా 49 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని వెల్లడించింది.
Today (08-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో 2 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ బుధవారం 2 కీలక సూచీలు లాభాల్లో ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.25 శాతం పెంచినప్పటికీ ఆ ప్రభావం ఈక్విటీ మార్కెట్‌పై ఏమాత్రం పడలేదు. ఐటీ, మెటల్, అదానీ గ్రూప్ స్టాక్స్ బెంచ్ మార్క్‌లకు మద్దతుగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలో గరిష్ట విలువలకు చేరాయి.
Today (08-02-23) Business Headlines: కెనరా బ్యాంక్ హెడ్’గా సత్యనారాయణరాజు: ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్ డైరెక్టర్ మరియు సీఈఓగా సత్యనారాయణరాజును నియమించారు. ఈ నిర్ణయం నిన్న మంగళ వారం నుంచే అమల్లోకి వచ్చింది. బ్రాంచ్ బ్యాంకింగ్, కార్పొరేట్ క్రెడిట్, రిటైల్ క్రెడిట్, అగ్రి ఫైనాన్సింగ్, క్రెడిట్ మానిటరింగ్, క్రెడిట్ రికవరీ వంటి విభాగాల్లో సత్యనారాయణరాజును నిపుణుడని చెప్పొచ్చు. అంత మంచి అనుభవం ఆయన సొంతం.
Indian Box Office Report: 2022వ సంవత్సరంలో సినిమా థియేటర్లు దద్దరిల్లాయి. ప్రేక్షకులతో హౌజ్‌ఫుల్ అయ్యాయి. మూవీలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. 2019వ సంవత్సరం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సంవత్సరంగా 2022 రికార్డులకెక్కింది. 2019లో మన దేశంలోని అన్ని భాషల చలన చిత్రాలు 10 వేల 637 కోట్ల రూపాయలను ఆర్జించాయి. 2019తో పోల్చితే 2022లో 300 కోట్లు మాత్రమే తక్కువ వచ్చాయి.
Demand for Hotel rooms: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి 2 నెలల్లో దేశంలోని హోటల్ రూములకు భారీ గిరాకీ నెలకొంటుందని యజమానులు అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్లు, కార్పొరేట్ ప్రయాణాలు ఎక్కువ జరగనుండటంతో హోటళ్లకు డిమాండ్ పెరగనుందని ఆశిస్తున్నారు. ఈ సంవత్సరంలోని జనవరి నెలలో లీజర్ మరియు కార్పొరేట్ ట్రావెల్స్ గణనీయంగా వృద్ధి చెందాయి. మేజర్ మెట్రో సిటీల్లో మరియు టియర్-2, టియర్-3 మార్కెట్లలో కార్పొరేట్ ప్రయాణాలు పీక్ స్టేజ్‌లో జరుగుతున్నాయి.
Today (07-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో ఇవాళ పెద్దగా ఆశాజనకమైన పరిస్థితేమీ కనిపించలేదు. ఈ రోజు మంగళవారం ఉదయం రెండు కీలక సూచీలు స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకొని చివరికి నష్టాల్లోనే ముగిశాయి. మధ్యాహ్నం జరిగిన ట్రేడింగ్‌లో కొంత వరకు నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇంట్రాడేలో ఫైనాన్షియల్ షేర్ల కొనుగోళ్లు జరగటంతో కాస్త ఊరట పొందాయి.
Today (07-02-23) Business Headlines: హైదరాబాదులో డచ్ ఐటీ సంస్థ విస్తరణ: డచ్ దేశానికి చెందిన గ్జేబియా ఇంజనీరింగ్ సంస్థ తన ఆఫీసును హైదరాబాదులో విస్తరించింది. మూడేళ్లలో 650 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ సంస్థ 19 దేశాల్లో ప్రత్యేక సాఫ్ట్’వేర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సర్వీసులను అందిస్తోంది. కంపెనీ ఫౌండర్, సీఈఓ కిరణ్ మాట్లాడుతూ తమ సాఫ్ట్’వేర్ ప్రొడక్టుల డివిజన్ కొన్నేళ్లుగా 30 శాతం చొప్పున గ్రోత్ సాధిస్తోందని చెప్పారు.
Is Shark Tank the next IPL: క్రికెట్లో ఐపీఎల్ టోర్నీ ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే.. ఆ బ్రాండ్ వ్యాల్యూ ఇప్పుడు 8 పాయింట్ 4 బిలియన్ డాలర్లకు చేరింది. అలాగే.. సోనీ టీవీలో ప్రసారమవుతున్న షార్క్ ట్యాంక్ ఇండియా రియాల్టీ షో పాపులారిటీని, వ్యూవర్‌షిప్‌ని చూస్తుంటే అది మరో ఐపీఎల్ కాబోతోందా అనిపిస్తోంది. ఐపీఎల్ మాదిరిగానే షార్క్ ట్యాంక్ ఇండియాకు కూడా తనకంటూ ఒక బ్రాండ్ వ్యాల్యూని గ్రాండ్‌గా డెవలప్ చేసుకునే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Today (06-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కి ఈవారం శుభారంభం లభించలేదు. రెండు కీలక సూచీలు కూడా ఇవాళ సోమవారం నష్టాలతోనే ప్రారంభమై నష్టాలతోనే ముగిశాయి. ఐటీ షేర్లలో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకోవటంతో ఇంట్రాడేలో ఇండెక్స్‌లు నెగెటివ్ జోన్లో కదలాడాయి. అయితే.. BROADER మార్కెట్లు మాత్రం మంచి పనితీరు కనబరిచాయి. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి.
Today (06-02-23) Business Headlines: ప్రపంచంలో విలువైన కరెన్సీగా..: ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ కొనసాగుతోంది. ఒక కువైట్ దినార్ వ్యాల్యూ లేటెస్టుగా 266 రూపాయల 64 పైసలకు చేరింది. ఈ జాబితాలో కువైట్ దినార్ తర్వాతి స్థానాల్లో బహ్రెయిన్ దినార్, ఒమిని రియాల్ నిలిచాయి. ఒక బహ్రెయిన్ దినార్ విలువ 215 రూపాయల 90 పైసలు పలికింది. ఒక ఒమిని రియాల్ వ్యాల్యూ 211 రూపాయల 39 పైసలుగా నమోదైంది.