Today (31-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇవాళ ట్రేడింగ్ మొత్తం అస్థిరంగానే సాగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 7 శాతంతో పోల్చితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతంగానే ఉంటుందని ఎకనమిక్ సర్వే-2023 పేర్కొనటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో 2 కీలక సూచీలు వరుసగా 2వ రోజు అంటే ఇవాళ కూడా బెంచ్ మార్క్‌లకు దిగువనే ముగిశాయి.
ఈ రోజు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన ఇండియన్ స్టాక్ మార్కెట్ సాయంత్రం స్వల్ప లాభాలతో క్లోజ్ అయింది. సెన్సెక్స్ నామమాత్రంగా 49 పాయింట్లు పెరిగి 59 వేల 549 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అత్యంత స్వల్పంగా 13 పాయింట్లు లాభపడి 17 వేల 662 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ హండ్రెడ్, నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ బెంచ్ మార్క్ సూచీలను అధిగమించి 2 శాతం వరకు లాభపడ్డాయి.
read more: Smart Phones: డిమాండ్ తగ్గిన ‘లో-వ్యాల్యూ’ స్మార్ట్ మొబైల్స్
దీంతో.. బ్రాడర్ మార్కెట్లు రోజంతా ఉత్సాహంగా కదలాడాయి. సెక్టార్ల వారీగా చూస్తే నిఫ్టీలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, మీడియా సంస్థల షేర్లు బాగా రాణించాయి. నాలుగు శాతం వరకు పెరిగాయి. మరో వైపు.. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఘోరంగా దెబ్బతింది. ఒక శాతం వరకు పతనమైంది. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే లార్సన్ అండ్ టూబ్రో స్టాక్స్ రెండు శాతం దాక డౌన్ అయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర 32 రూపాయలు పడిపోయింది.
ఫలితంగా.. గరిష్టంగా 56 వేల 750 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 667 రూపాయలు తగ్గి 67 వేల 922 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 109 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు రేటు 6 వేల 309 రూపాయాల వద్ద స్థిరపడింది. రూపాయి వ్యాల్యూ 39 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 92 పైసలుగా నమోదైంది.