Aero India 2023: అమృత మహోత్సవం నుంచి అమృత కాలంలోకి ప్రవేశిస్తున్న భారతదేశం మేకిన్ ఇండియా ద్వారా స్థానికంగా ఉత్పత్తులను పెంచుకోవాలని ఆశిస్తోంది. సోవియెట్ కాలం నాటి పరికరాలను ఆధునికీకరించుకోవాలని కృషి చేస్తోంది. దేశీయ విమానయాన సంస్థలు తమ ఫ్లైట్ల సంఖ్యను భారీగా పెంచుకోవాలని కోరుకుంటున్నాయి. ఈ మేరకు విదేశీ సంస్థలకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు కూడా పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
Today (15-02-23) Business Headlines: షార్ట్ సెల్లింగ్‌ని నిషేధించం: ఈక్విటీ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్‌ను నిషేధించే ఉద్దేశం లేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. షార్ట్ సెల్లింగ్ అనేది అవసరమేనని, దానివల్ల షేర్ల అసలు విలువను కనిపెట్టొచ్చని అభిప్రాయపడింది. 2020వ సంవత్సరం మార్చి నెలలో.. అంటే.. కరోనా ప్రారంభ సమయంలో.. 13 రోజుల్లోనే నిఫ్టీ విలువ 26 శాతం పతనమైనప్పటికీ షార్ట్ సెల్లింగ్‌పై నిషేధం విధించలేదని గుర్తుచేసింది.
IT, Engineering Recruitment: ఇంజనీరింగ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులు చదివిన అభ్యర్థులకు సువర్ణావకాశం. ఎయిర్‌బస్ సంస్థ ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో బెంగళూరులో మీట్ అండ్ గ్రీట్ అనే ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఏరో ఇండియా-2023 ఎయిర్‌షో సందర్భంగా ఈ నియామక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఆశావహులు ఆ సంస్థ అధికారులను కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.
Today (14-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో ఇవాళ మొత్తం పాజిటివ్ ట్రేడింగ్ నడిచింది. ఈ రోజు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభపడి నేటి అత్యధిక విలువ అయిన 61 వేల 102 పాయింట్లను నమోదు చేసింది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పెరిగి ఒకానొక దశలో 17 వేల 900 పాయింట్లను దాటిపోయింది. ఐటీ స్టాక్స్ ర్యాలీ తీయటంతో లాభాలు కొనసాగాయి.
RIL Investments: రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చే నాలుగేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో 75 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా కొత్తగా లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఈ పెట్టుబడులు.. ఈ ఉద్యోగాలు.. టెలికం, రిటైల్ మరియు రెనివబుల్ బిజినెస్‌లలో అందుబాటులోకి రానున్నాయి. రిలయెన్స్ ఇప్పటికే యూపీలో 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. తద్వారా 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.
Loss For Life Insurers: ప్రజల జీవితాలకు బీమా ఇవ్వాల్సిన కంపెనీలకే ధీమా లేకుండా పోతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్.. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇబ్బందికరంగా మారింది. అధిక ప్రీమియం ప్రొడక్టులపై పన్ను విధించాలన్న బడ్జెట్ ప్రతిపాదన తమకు నష్టదాయకంగా మారనుందని జీవిత బీమా సంస్థలు బాధపడుతున్నాయి. వార్షిక ప్రీమియం 5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఉన్న బీమా ఉత్పత్తులపై ట్యాక్స్ వేస్తే తమ రెవెన్యూ 10 నుంచి 12 శాతం వరకు పడిపోతుందని ఆందోళన చెందుతున్నాయి.
Today (14-02-23) Business Headlines: సుజుకీతో టీ హబ్ ఒప్పందం: జపాన్ కంపెనీ సుజుకీ మోటార్‌తో తెలంగాణ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడి స్టార్టప్‌లు ఆ దేశంలోని అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. టీ హబ్‌లోని స్టార్టప్‌లు సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా గైడెన్స్ పొందొచ్చని తెలిపింది. మొబిలిటీ సెక్టార్లో ఎదురయ్యే ఛాలెంజ్‌లకు ఇదొక సొల్యూషన్ మాదిరిగా తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
Today (13-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కి ఈ వారం శుభారంభం లభించలేదు. గ్లోబల్ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందటంతో రెండు కీలక సూచీలు కూడా ఇవాళ సోమవారం ఉదయం ఫ్లాట్‌గానే ప్రారంభమై కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇండియా మరియు అమెరికాలో కీలకమైన ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ముందుజాగ్రత్త పాటించారు.
Global Economy's Ray of Hope: చైనా.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆ దేశం ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి కోలుకుంటోంది. కొవిడ్ జీరో పాలసీకి డిసెంబర్లో స్వస్తి చెప్పింది. రెండు నెలల కిందట తీసుకున్న ఈ నిర్ణయం చైనాను ఆర్థికపరంగా పూర్తి స్థాయిలో కుదుటపర్చలేదు. రియల్ ఎస్టేట్, తయారీ, ఎగుమతులు, కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ వంటి రంగాలు ఇంకా బలహీనంగానే కనిపిస్తున్నాయి. ఈ సెక్టార్లు మరింత కాలం ఇలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
Tech Layoffs to Continue: 2022 జనవరిలో లేఆఫ్ అనే పదాన్ని గూగుల్‌లో ఐదుగురు మాత్రమే సెర్చ్ చేయగా.. ఈ సంవత్సరం జనవరిలో ఏకంగా వంద మంది సెర్చ్ చేశారు. అంటే.. ఏడాది వ్యవధిలోనే లేఆఫ్ అనే వర్డ్ ఎంత పాపులర్ అయిందో అర్థంచేసుకోవచ్చు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయం పెద్దగా ఆశ్చర్యం కూడా కలిగించకపోవచ్చేమో. ఎందుకంటే.. ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా లేఆఫ్ అనే పదమే కనిపిస్తోంది.. వినిపిస్తోంది. కంపెనీలు ఆ రేంజ్లో ఉద్యోగులను తొలగిస్తుండటమే అందుకు కారణం.