Scrub Typhus: ఏపీలో రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో వ్యాపిస్తున్న భయాందోళనలను తొలగించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. స్క్రబ్ టైఫస్ కొత్త వ్యాధి కాదని, ప్రతి సంవత్సరం మలేరియా, డెంగీ లాగే సుమారు 1300 నుంచి 1600 కేసులు నమోదవుతూ ఉంటాయని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1566 కేసులు నమోదయ్యాయని, గత సంవత్సరం 1613 కేసులు ఉన్నాయని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వల్ల వెంటనే మరణాలు సంభవించవని.. ఇప్పటి వరకు నమోదైన 9 మరణాలు స్క్రబ్ టైఫస్ వల్ల మాత్రమే కాదని.. ఇప్పటికే ఉన్న ఇతర వ్యాధులు, ఆలస్యంగా ఆసుపత్రికి రావడం వల్ల జరిగినవని కమిషనర్ స్పష్టం చేశారు. అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్ లాంటి మందులతో ఇది పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని ఆయన తెలిపారు.
Priyanka Gandhi: వందేమాతరంపై చర్చ వెనుక కారణం ఇదే.. కేంద్రంపై ప్రియాంక గాంధీ సీరియస్
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్క్రబ్ టైఫస్‌కు చికిత్స అందుబాటులో ఉందని, జ్వరం వచ్చిన 5వ రోజు నుంచి 20వ రోజు మధ్యలో ఈ వ్యాధి బయటపడే అవకాశం ఎక్కువని అన్నారు. గుంటూరు, విజయవాడ జీనోమ్ ల్యాబ్‌లను యాక్టివేట్ చేస్తూ కేసుల విశ్లేషణను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.ఇక గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తెలిపిన వివరాల ప్రకారం.. స్క్రబ్ టైఫస్ వార్డులో ఉన్న 12 మందిలో 6 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ముందునుంచి వ్యాధులు ఉన్న వారు ఆలస్యంగా ఆసుపత్రికి రావడంతో పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని చెప్పారు.
Kishan Reddy: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేందుకు అందరూ కృషి చేయాలి..!
మరోవైపు వ్యవసాయ, గ్రామీణ శాఖలకు ప్రత్యేక అలర్ట్ జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. ప్రతి జిల్లాలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసామని, కలెక్టర్లు ప్రతీ వారం ఈ అంశంపై సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. IHIP పోర్టల్‌లో ప్రతీ కేసు బాధ్యతగా అప్డేట్ చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇది రోగనిరోధక చర్యల్లో కీలకమని వెల్లడించారు. అలాగే మరో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. స్క్రబ్ టైఫస్ కారణంగా నేరుగా మరణాలు సంభవించాయని చెప్పడం శాస్త్రీయంగా సరైంది కాదన్నారు. ఎలిసా ద్వారా ఒక్కసారి నిర్ధారించడం సరిపోదని, కోల్డ్ జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఇందుకు మూడు నెలల వరకు సమయం పట్టవచ్చని స్పష్టం చేశారు.