Today (13-02-23) Business Headlines: మనోళ్లే మార్కెట్ ఓనర్లు: ఇండియన్ ఈక్విటీ మార్కెట్’లో డొమెస్టిక్ ఇన్వెస్టర్ల ఓనర్’షిప్.. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్’లో లైఫ్ టైమ్ హయ్యస్ట్ లెవల్’కి చేరుకుంది. అంటే.. 24 పాయింట్ నాలుగు నాలుగు శాతంగా నమోదైంది. వరుసగా ఐదో త్రైమాసికంలో కూడా గ్రోత్ నెలకొనటం విశేషం. ఈ యాజమాన్యం.. వ్యక్తులు మరియు సంస్థలది కావటం గమనించాల్సిన విషయం. ఇదిలా ఉండగా.. రిటైల్ ఇన్వెస్టర్ల ఓనర్’షిప్ మాత్రం సున్నా పాయింట్ ఒకటీ ఒకటీ శాతం తగ్గింది.
RBI: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే నాలుగు సార్లు రెపో రేటును పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మరోసారి కూడా వడ్డీ రేటును పెంచుతుందని చాలా మంది విశ్లేషకులు ముందుగానే భావించారు. కొంత మంది అనలిస్టులేమో ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకూ రెపో రేటు పెంపు ఉండబోదని, ఈ విషయంలో ఆర్బీఐ పాటిస్తున్న విరామం ఈ రెండు నెలలు కూడా కొనసాగుతుందని అనుకున్నారు.
Positive News From Adani Group: గడచిన రెండు మూడు వారాలుగా అన్నీ బ్యాడ్ న్యూసే వస్తున్న గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల నుంచి ఇప్పుడు గుడ్ న్యూస్ కూడా వచ్చాయి. అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో విశేషంగా రాణించటం ఒక పాజిటివ్ అప్డేట్ కాగా.. అదానీ గ్రూపు కంపెనీలు లోన్లకు ప్రీపేమెంట్లు చేస్తుండటం మరో చెప్పుకోదగ్గ అంశం. అదానీ ట్రాన్స్మిషన్ సంస్థకు గతేడాది 3వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి ఏకంగా 78 శాతం లాభం వచ్చింది.
Today (11-02-23) Business Headlines: బెల్జియం, తెలంగాణ ఒప్పందం: లైఫ్ సైన్సెస్ రంగంలో బెల్జియంకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. బెల్జియం దేశంలోని ఫ్లాండర్స్ అనే ప్రాంతంలో సుమారు 350 లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయి. బయోఏషియా-2023కి ఫ్లాండర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ పార్ట్నర్. ఈ నేపథ్యంలో ఫ్లాండర్స్ ఇన్వెస్ట్’మెంట్ అండ్ ట్రేడ్’తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతులు కలిపింది. తద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోనుంది.
Jewellery Prices: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్లో.. విలువైన లోహాలతోపాటు బంగారం, వెండి, ప్లాటినం వస్తువులు మరియు ఇమిటేషన్ ఆభరణాలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. 2023-24 బడ్జెట్లో ఈ దిగుమతి పన్నును 22 శాతం నుంచి 25 శాతానికి చేర్చారు. దీంతో నగల రేట్లు పెరగనున్నాయి. ఈ నిర్ణయం.. గోల్డ్, సిల్వర్, ప్లాటినం ధరలతోపాటు డిమాండ్ పైన కూడా ప్రభావం చూపనుంది.
Today (10-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతాన్ని నష్టాలతో ప్రారంభించి నష్టాలతోనే ముగించింది. ఇవాళ శుక్రవారం ఈక్విటీ మార్కెట్లు ఎక్కువ శాతం నేల చూపులు చూశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ.. 50 పాయింట్లకు పైగా పడిపోగా.. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా కోల్పోయింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్ తదితర సంస్థల షేర్ల అమ్మకాలు పెరగటంతో కీలకమైన సూచీలు కోలుకోలేకపోయాయి.
Special Story on Amazon’s Logistics Business: అమేజాన్ బ్రాండ్ లోగోలో.. A టు Zను తెలియజేస్తూ బాణం గుర్తుంటుంది. అది ఆ కంపెనీ డెలివరీ చేసే ప్రొడక్టుల రేంజ్కి అద్దం పడుతోంది. అంటే.. అమేజాన్ అందించని సేవలంటూ ఏమీ లేవని కూడా పరోక్షంగా అర్థంచేసుకోవచ్చు. ఇ-కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగిన అమేజాన్.. ఇటీవల ఇండియాలో ‘అమేజాన్ ఎయిర్’ అనే సరికొత్త సర్వీసును లాంఛ్ చేసింది. దీంతో.. విమానాల ద్వారా కూడా ఉత్పత్తుల చేరవేతను ప్రారంభించింది.
Today (10-02-23) Business Headlines: జెమినీ ప్యూర్ఇట్ సన్ఫ్లవర్ ఆయిల్: కార్గిల్ అనే సంస్థ ఇటీవల జెమినీ ప్యూర్ ఇట్ పొద్దు తిరుగుడు నూనెను విడుదల చేసింది. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లలోకి కూడా అందుబాటులోకి తేనుంది. ఇది ప్రీమియం క్వాలిటీతో కూడిన ప్రొడక్ట్ అని కార్గిల్ ఫుడ్ ఇన్గ్రిడియెంట్స్ సౌత్ ఏసియా కన్జ్యూమర్ బిజినెస్ హెడ్ అవినాశ్ త్రిపాఠి తెలిపారు.
Today (09-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ గురువారం నష్టాలతో ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం జరిగిన లావాదేవీలు బెంచ్ మార్క్ ఇండెక్స్లకు లాభాలు పంచాయి. ఐటీ మరియు ఫైనాన్షియల్ షేర్ల అమ్మకాలు దీనికి ఊతంగా నిలిచాయి. ముఖ్యంగా ట్రేడింగ్ చివరి గంటలో బాగా పుంజుకున్నాయి. చివరికి రెండు సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 142 పాయింట్లు పెరిగి 60 వేల 806 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 17 వేల 893…
Today (09-02-23) Business Headlines: రెండేళ్లలో 1700 విమానాలకు ఆర్డర్లు: రానున్న రోజుల్లో విమాన ప్రయాణాలు పెరిగే అవకాశం ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చితే ఇండియాలోనే ఎక్కువని కన్సల్టెన్సీ కంపెనీ.. కాపా.. పేర్కొంది. ఈ డిమాండ్ నేపథ్యంలో భారత విమానయాన రంగ సంస్థలు ఒకటీ రెండేళ్లలో 15 వందల నుంచి 17 వందల వరకు కొత్త విమానాల కోసం ఆర్డర్లు పెడతాయని తెలిపింది. ఎయిరిండియా ఒక్కటే 500 విమానాలు కొనే సూచనలున్నాయని వెల్లడించింది.