Companies Names-Full Forms: కంపెనీల పేర్లు సహజంగా షార్ట్ కట్లో ఉంటాయి. అందులో రెండు మూడు ఇంగ్లిష్ లెటర్స్‌ను మాత్రమే పేర్కొంటారు. అందువల్ల చాలా మందికి వాటి పూర్తి పేర్లు తెలియవు. కాబట్టి వాటిని తెలుసుకోవటం ఆసక్తికరమైన అంశం. ఈ నేపథ్యంలో 40 పెద్ద కంపెనీల పూర్తి పేర్లను తెలుసుకుందాం. అవి.. ఉదాహరణ రెండు మూడు చూద్దాం. 1. HTC... హై టెక్ కంప్యూటర్ (High Tech Computer). 2. IBM... ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ (International Business Machines). 3. Infosys.. ఇన్ఫర్మేషన్…
Home Rents: రోజులు మారుతున్నాయి. పరిస్థితులు కుదుటపడుతున్నాయి. మన దేశంలోని వివిధ రంగాల్లో మళ్లీ కరోనా ముందు నాటి సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. అద్దె ఇళ్ల మార్కెట్ దీనికి చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. కొవిడ్ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లినవాళ్లు ఇప్పుడు క్రమంగా నగరాలకు చేరుకుంటున్నారు. కార్యాలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. దీంతో సిటీల్లో అద్దెకు ఉండేవాళ్ల సంఖ్య పెరుగుతోంది.
Today (20-02-23) Business Headlines: జీ20 విత్త మంత్రుల భేటీ: జీ20 దేశాల ఆర్థికమంత్రులు మరియు కేంద్ర బ్యాంకుల గవర్నర్ల మీటింగ్ ఈ నెలాఖరులో.. అంటే.. శుక్ర, శనివారాల్లో బెంగళూరులో జరగనుంది. జీ20 దేశాలకు ఇండియా అధ్యక్షత చేపట్టిన అనంతరం జరుగుతున్న తొలి సమావేశమిది కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ భేటీ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో జరుగుతుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సహధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
Today (17-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతం రోజున ఇవాళ శుక్రవారం ఎక్కువ శాతం నెగెటివ్ ట్రెండ్‌లోనే నడిచింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం భారీ నష్టాలతో ముగిశాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ని దెబ్బతీశాయి. బ్యాంకింగ్ మరియు రియాల్టీ రంగాలు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కొన్నాయి.
100 Airports: వచ్చే ఏడాది నాటికి మన దేశంలో వంద విమానాశ్రయాలు డెవలప్ కానున్నాయి. ఇందులో భాగంగా.. ఇప్పటికే ఉన్న ఎయిర్‌పోర్టులను ఉన్నతీకరించటం మరియు ఆధునికీకరించటం జరుగుతుంది. ఉదే దేశ్ కా ఆమ్ నాగ్రిక్.. అంటే.. ఉడాన్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద ఈ పనులు చేపడతారు. ఈ ప్రాంతీయ అనుసంధాన పథకం కింద ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఇతర ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు వీటిని పూర్తి చేస్తారు.
Today (17-02-23) Business Headlines: హైదరాబాదులో బయోఏషియా సదస్సు: హైదరాబాద్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బయోఏషియా సదస్సు జరగనుంది. HICC నొవాటెల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో స్టార్టప్ స్టేజ్ పెవిలియన్.. సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవనుంది. హెల్త్ మరియు బయాలజీ సెగ్మెంట్లో స్టార్టప్‌లను ఎంకరేజ్ చేయాలనే టార్గెట్‌తో ఈ పెవిలియన్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సింగపూర్, థాయ్‌లాండ్, అమెరికా, ఐర్లాండ్, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన 400 స్టార్టప్‌లు అప్లై చేయగా 75 స్టార్టప్‌లను మాత్రమే సెలెక్ట్…
Today (16-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో ఇవాళ గురువారం కూడా ఆశాజనకమైన పరిస్థితి కనిపించింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం సైతం స్వల్ప లాభాలతో ముగిశాయి. వీక్లీ నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్ ఫ్లాట్‌గా ఎండ్ అయింది. మధ్యాహ్నం జరిగిన డీల్స్ మాత్రం మంచి లాభాలను తెచ్చిపెట్టాయి.
Air India: వాణిజ్య విమానయాన చరిత్రలో ఎయిరిండియా సరికొత్త అధ్యాయం లిఖిస్తోంది. ఫ్రాన్స్ సంస్థ ఎయిర్బస్తోపాటు అమెరికా కంపెనీ బోయింగ్‌తో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండింటి నుంచి 500లకు పైగా కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది. తద్వారా భారతదేశ విమానయాన రంగంలో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఎయిరిండియా ఆశిస్తోంది. అదే సమయంలో.. లోకల్ లో-కాస్ట్ ప్రత్యర్థి సంస్థలను మరియు ఎమిరేట్స్ వంటి పవర్ఫుల్ గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ను ధీటుగా ఢీకొట్టబోతోంది.
Today (16-02-23) Business Headlines: ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్‌లు: ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌లను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే దాఖలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2023-24 అసెస్మెంట్ ఇయర్ మొదటి రోజు నుంచే ఐటీఆర్ ఫారాలు అందుబాటులో ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపింది. పోయినేడాది ఐటీఆర్ ఫారాలతో పోల్చితే వీటిలో పెద్దగా మార్పులు లేవని పేర్కొంది. కాబట్టి ఐటీఆర్‌లను దాఖలుచేయటం ఇక తేలికని వెల్లడించింది.
Today (15-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం లేటుగా పుంజుకుంది. దీంతో.. ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం భారీ లాభాల్లోనే ముగిసింది. రెండు కీలక సూచీలు కూడా బెంచ్ మార్క్‌లకు పైనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ చాలా రోజుల తర్వాత 18 వేల పాయింట్లను మించటం విశేషం. రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ర్యాలీ తీయటం కలిసొచ్చింది.