Real Story Behind Tech Companies Layoffs: టెక్ కంపెనీలు అసలు లేఆఫ్‌లకు ఎందుకు పాల్పడుతున్నాయో తెలుసా?. పైకి చెప్పుకుంటున్న ఆర్థిక మందగమనం.. ఖర్చుల తగ్గింపు.. అదనపు సిబ్బందిని తొలగించుకోవటం.. ఇవేవీ కారణాలు కాదు. ఎందుకంటే.. ఉద్యోగులను తొలగించినంత మాత్రాన కంపెనీలు లాభపడినట్లు గతంలో ఎప్పుడూ రుజువు కాలేదు. పైగా.. స్టాఫ్‌ని ఉన్నపళంగా ఇంటికి పంపించటం వల్ల సంస్థలకు నష్టమే కలుగుతోంది.
Business Headlines 27-02-23: ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా లేదు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంటుందని, ఆర్థిక వృద్ధి మందగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానెటరీ పాలసీ కమిటీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ అన్నారు. ఆర్థిక వృద్ధి బలహీనంగా ఉండటం వల్ల అంచనాల కన్నా తక్కువగానే నమోదవుతుందని తెలిపారు. వడ్డీ రేట్లు పెరగటం వల్ల ఆ ప్రభావం ఈఎంఐలపై పడి ఫ్యామిలీ బడ్జెట్ తగ్గుతుందని చెప్పారు. చివరికి ఖర్చులు సైతం తగ్గుతున్నాయని పేర్కొన్నారు.
UPI LITE Payments: క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి పేమెంట్ చేసేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారా?.. మన ఫోన్లో డబ్బులు కట్ అవుతున్నాయి కానీ అవతలి వ్యక్తికి చేరట్లేదా?.. ఇలాంటి సమస్యలకు ఇక కాలం చెల్లింది. వీటికి పరిష్కారంగా UPI LITE సర్వీస్ వచ్చేసింది. యూపీఐ లైట్‌తో చెల్లింపులు చేయటానికి పిన్ నంబర్ కూడా అవసరంలేదు. కాబట్టి.. పేమెంట్.. ఫాస్ట్‌గా.. ఈజీగా.. పూర్తవుతుంది. ఈ లావాదేవీల్లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువే కావటం చెప్పుకోదగ్గ విషయం.
Business Headlines 25-02-23: పేటీఎం బ్యాంక్‌లో విలీనం?: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎయిర్టెల్ అధినేత సునీల్ మిత్తల్ ప్రణాళిక రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేటీఎంలో విలీనం కావటం ద్వారా వాటా సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఇతర షేర్ హోల్డర్ల నుంచి కూడా పేటీఎంలోని వాటాలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
World Economy in 2023: ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోందనే ప్రశ్నకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సవివరంగా సమాధానం చెప్పింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి తక్కువగా ఉంటుందని, అదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా దిగొస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు లేటెస్ట్ వరల్డ్ ఎకనమిక్ ఔట్లుక్ పేరిట రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. ఎక్కువ దేశాల్లో జీవన వ్యయ సంక్షోభం నెలకొంటుందని, అయినప్పటికీ ద్రవ్యోల్బణం పెరగకుండా చూసుకునేందుకే ఆయా ఆర్థిక వ్యవస్థలు ప్రాధాన్యత ఇస్తాయని తెలిపింది.
Stock Market Roundup 24-02-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం మొత్తం నష్టాలనే చవిచూసింది. ఇవాళ శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం నష్టాలతోనే ముగిసింది. మధ్యాహ్నం జరిగిన లావాదేవీల వల్ల రెండు కీలక సూచీలు కూడా లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీసీ మరియు లార్సన్ అండ్ టూబ్రో వంటి సంస్థల షేర్ల విలువ పడిపోవటం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.
Indian Rupee: అమెరికా డాలర్‌తో పోల్చితే మన రూపాయి మారకం విలువ రోజు రోజుకీ పడిపోతోంది. ప్రస్తుతం 83 రూపాయల దిశగా పయనిస్తోంది. ఆ స్టేజ్ కూడా దాటిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ కరెన్సీ ఇంతలా బక్క చిక్కటానికి చాలా కారణాలున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను మరింత పెంచనుందనే భయం.. దేశీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం.. క్రూడాయిల్ రేట్లు పెరగటం.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు భారీగా వృద్ధి చెందటం.. దీనికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
Business Headlines 24-02-23: BWA-తెలంగాణ ఒప్పందం: తెలంగాణ రాష్ట్రాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానంలో అగ్ర స్థానంలో నిలబెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ల శాఖ శ్రీకారం చుట్టింది. వెబ్3 టెక్నాలజీ సంస్థ భారత్ వెబ్3 అసోసియేట్స్.. BWAతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం BWA కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో సదస్సులు, ప్రదర్శనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
Today (23-02-23) Stock Market Roundup: ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఇవాళ గురువారం కూడా నష్టాల్లోనే ముగిసింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన రెండు కీలక సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సాయంత్రం వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నెలవారీ ముగింపునకు వస్తుండటం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇదిలాఉండగా.. ఎఫ్ఎంసీజీ, మెటల్ మరియు ఐటీ షేర్లు రాణించి బెంచ్‌మార్క్‌లను దాటడం చెప్పుకోదగ్గ అంశం.
Google and Twitter: గ్లోబల్ టెక్ కంపెనీలు ఇతర దేశాలతోపాటు ఇండియాలో కూడా ఖర్చులను తగ్గించుకోవటంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. ఇన్నాళ్లూ ఉద్యోగులను రాత్రికిరాత్రే తీసివేయగా ఇప్పుడు ఆఫీసులను సైతం తెల్లారే సరికి మూసివేస్తున్నాయి. తాజాగా గూగుల్ మరియు ట్విట్టర్ సంస్థలు ఈ మేరకు చర్యలు చేపట్టాయి. గూగుల్ కంపెనీ 453 మందికి లేఆఫ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 12 వందల మంది ఉద్యోగులను తీసేయటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.