Business Headlines 23-02-23: హైదరాబాద్ టు బ్యాంకాక్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా విమానాలను ఇప్పటికే థాయ్ ఎయిర్వేస్ సంస్థ నడుపుతుండగా ఇప్పుడు మరో కంపెనీ ఈ సర్వీసును ప్రారంభించింది. నోక్ ఎయిర్ అనే సంస్థ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి నిన్న బుధవారం కొంత మంది ప్రయాణికులను చేరవేసింది.
Today (22-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లోని 2 కీలక సూచీలైన సెన్సెక్స్ మరియు నిఫ్టీ వరుసగా నాలుగో రోజు అంటే ఇవాళ బుధవారం కూడా నేల చూపులు చూశాయి. దీంతో కేవలం ఈ 4 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద 7 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. ముందు ముందు కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు మరింత పెరగనున్నాయనే భయాలు పెట్టుబడిదారులను వెంటాడాయి.
Air India order support US jobs: ఇప్పుడు.. సీన్ రివర్స్ అయింది. మనోళ్లకు అమెరికా ఉద్యోగాలివ్వటం కాదు. అమెరికన్లకే మనం ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకున్నాం. వినటానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది నిజం. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడే ఈ మాట అన్నాడు. కొత్త విమానాల కోసం ఎయిరిండియా సంస్థ తమ కంపెనీ బోయింగ్‌కి భారీ ఆర్డర్ ఇవ్వటం వల్ల యూఎస్‌లో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని ఆ దేశ ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు.
Today (22-02-23) Business Headlines: అదానీపై వికీపీడియా సైతం: ఇప్పటికే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ సెగ నుంచి పూర్తిగా బయటపడని గౌతమ్ అదానీ గ్రూప్‌పై తాజాగా వికీపీడియా సైతం ఆరోపణలు గుప్పించింది. గౌతమ్ అదానీ, ఆయన ఫ్యామిలీ తమ గ్రూపు కంపెనీలకు అనుకూలంగా వ్యాసాలు రాయించుకున్నారని తప్పుపట్టింది. సంస్థలోని ఉద్యోగులను ఈ మేరకు వాడుకున్నట్లు తెలిపింది. వికీపీడియాలో ఏదైనా పేజీని ఎవరైనా మార్చే అవకాశం ఉండటంతో ఈ వెసులుబాటును వాడుకుందని పేర్కొంది.
Today (21-02-23) Stock Market Roundup: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో ఇవాళ మంగవాళం ఎక్కువ శాతం ట్రేడిండ్ ఊగిసలాట ధోరణిలో నడిచింది. రెండు కీలక సూచీలు లాభనష్టాల మధ్య దోబూచులాడాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్.. సాయంత్రం స్వల్ప నష్టాలతో ముగిసింది. నిఫ్టీ 18 వేల బెంచ్ మార్క్‌కి దిగువన క్లోజ్ అయింది. ఇంట్రాడేలో టాటా స్టీల్ మరియు రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపటంతో సెన్సెక్స్, నిఫ్టీ కాస్త కోలుకున్నాయి.
India found deposit of lithium: ఇన్నాళ్లూ మనం పత్తి పంటను మాత్రమే తెల్ల బంగారమని అనుకునేవాళ్లం. కానీ.. లిథియం అనే ఖనిజాన్ని కూడా తరచుగా తెల్ల బంగారంగానే అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే.. ఇండియాలో ఇది ఇప్పటివరకూ చాలా చాలా తక్కువ మొత్తంలోనే దొరికేది. అందుకే.. అత్యంత విలువ కలిగిన బంగారంతో పోల్చారు. అయితే.. ఇప్పుడు ఈ లిథియం ఖనిజం భారతదేశంలో భారీగా ఉన్నట్లు గుర్తించారు.
Renault, Nissan Vehicles: ఇటీవలే ఒక్కటైన రెండు కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్ మరియు నిస్సాన్.. తమ ఫస్ట్ జాయింట్ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించాయి. ఇండియాలో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికను కూడా ప్రకటించాయి. ఇందులో భాగంగా 600 మిలియన్ డాలర్ల పెట్టుబడితో చెన్నైలోని మ్యానిఫ్యాక్షరింగ్ ప్లాంట్‌ని డీకార్బనైజ్ చేయనున్నాయి. కొత్త మోడల్ కార్ల తయారీ ద్వారా దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి ఆరు కొత్త వాహనాలను ఉత్పత్తి చేయనున్నాయి.
Today (21-02-23) Business Headlines: హైదరాబాద్ సంస్థకి సెబీ ఫైన్: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ ఎస్ఎస్ ఆర్గానిక్స్‌కి సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. ఫైన్ వేసింది. ఈ కంపెనీపై 5 లక్షల రూపాయలు జరిమానా విధించింది. దీంతోపాటు మరో ఆరుగురికి 6 లక్షల రూపాయల ఫైన్ వేసింది. ఏఆర్ఆర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థతో జరిపిన రిలేటెడ్ పార్టీ లావాదేవీలను వెల్లడించటాన్ని తప్పుపట్టింది. ట్రాన్సాక్షన్లను ఆమోదించే విషయంలో ఎస్ఎస్ ఆర్గానిక్స్ అనుసరించిన ప్రక్రియను సైతం పరిశీలించి ఈ ఆదేశాలను జారీ…
Today (20-02-23) Stock Market Roundup ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఈ వారాన్ని శుభారంభం చేసినప్పటికీ ఆ పాజిటివ్ ట్రెండ్‌ని కొనసాగించలేకపోయాయి. ఇవాళ సోమవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమైనా.. కొద్దిసేపటికే ఫ్లాట్‌గా ట్రేడ్ అవటం ప్రారంభించాయి. మధ్యాహ్నం జరిగిన లావాదేవీలతో నష్టాలు పెరిగాయి. స్టేట్ బ్యాంక్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరగటం వల్ల ఇండెక్స్‌లు కోలుకోలేకపోయాయి.
Banks exposure to Adani Group: అదానీ గ్రూప్ కంపెనీల బిజినెస్‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ అనంతరం ఇన్వెస్టర్లు, డిపాజిటర్లు లబోదిబో అంటున్నారు. తమ డబ్బు ఏమైపోతుందో ఏమోనని దిగులు పెట్టుకున్నారు. దీంతో పార్లమెంట్ సైతం ఇదే వ్యవహారంపై దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో.. అదానీ గ్రూపు సంస్థలకు రుణాలిచ్చిన బ్యాంకులు మరియు ఎల్ఐసీ ఒకదాని తర్వాత ఒకటి స్పందిస్తున్నాయి. తాము ఎంత లోనిచ్చామో చెబుతున్నాయి.