Today (16-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇవాళ గురువారం కూడా ఆశాజనకమైన పరిస్థితి కనిపించింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం సైతం స్వల్ప లాభాలతో ముగిశాయి. వీక్లీ నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్ ఫ్లాట్‌గా ఎండ్ అయింది. మధ్యాహ్నం జరిగిన డీల్స్ మాత్రం మంచి లాభాలను తెచ్చిపెట్టాయి.
ఈ రోజు.. సెన్సెక్స్.. క్యాలెండర్ ఇయర్‌లోనే అత్యధిక విలువ అయిన 61 వేల 682 పాయింట్లకు చేరుకోవటం విశేషం. ఐటీ మరియు ఫైనాన్షియల్ షేర్లు బాగా రాణించాయి. బ్రాడర్ ఇండెక్స్‌లు కూడా ఔట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. సెన్సెక్స్.. 44 పాయింట్లు పెరిగి 61 వేల 319 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. 20 పాయింట్లు లాభపడి 18 వేల 35 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.
read more: Air India: చరిత్ర సృష్టించనున్న ఎయిరిండియా
సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 18 కంపెనీలు నష్టాల బాటలో నడవగా మిగిలిన 12 సంస్థలు లాభాలు పొందగలిగాయి. టెక్ మహింద్రా కంపెనీ షేర్లు 5 శాతం ర్యాలీ తీశాయి. ఎల్‌టీటీఎస్ స్టాక్స్ కూడా మంచి పనితీరు కనబరిచాయి. అన్ని సెక్టార్ల స్టాక్స్ పాజిటివ్‌గానే ట్రేడయ్యాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల షేర్లు ఒకటిన్నర శాతానికి ప్రాఫిట్స్ సాధించాయి.
10 గ్రాముల బంగారం ధర 41 రూపాయలు తగ్గి గరిష్టంగా 56 వేల 85 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు అత్యంత స్వల్పంగా 2 రూపాయలు తగ్గింది. అత్యధికంగా 65 వేల 419 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర సైతం 13 రూపాయలే తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 498 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 15 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 70 పైసల వద్ద స్థిరపడింది.