Maoists Surrender: మావోయిస్టులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కీలక నాయకుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్ కూడా ఉన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలిపిన ఎంఎంసీ జోన్‌లో రాంధెర్ కీలకంగా పని చేస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత శీఘ్రనేత మిళింద్ తెల్టుంబే మరణించిన తర్వాత ఎంఎంసీ బాధ్యతలన్నీ రాంధెర్ చూసినట్లు పోలీసులు వెల్లడించారు.
READ ALSO: AMB Banglore: బెంగళూరులో మహేష్ ఏఎంబి..ఆరోజే ఓపెనింగ్
తాజాగా లొంగిపోయిన రాంధెర్‌పై రూ.3 కోట్ల రివార్డు ఉందని పోలీసులు ప్రకటించారు. రాంధెర్ లొంగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నక్సల్ క్రియాశీలతను గణనీయంగా తగ్గిస్తుందని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలి నెలల్లో వివిధ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతుండటం గమనార్హం. మావోయిస్టు నాయకత్వంలో అంతర్గత విభేదాలు, భద్రతాదళాల ఆపరేషన్ల కఠినతరం, ప్రభుత్వ పునరావాస పథకాలు వంటి పరిణామాలు పెద్ద సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటుకు కారణమైనట్లు అధికారులు అభిప్రాయపడ్డారు.
READ ALSO: Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి